కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవాళ్లు డైరెక్ట్, రెగ్యులర్ ఫండ్స్ మధ్య కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి ఫండ్ లో డైరెక్ట్, రెగ్యులర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితె అందులో ఎప్పుడు దేన్ని ఎంచుకోవాల? అసలు ఆ రెండింటికీ మధ్య తేడా ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
డైరెక్ట్ vs రెగ్యులర్ ఫండ్స్
డైరెక్ట్, రెగ్యులర్ అనేది పెట్టుబడి పెట్టే రెండు విధానాలు. ఒకే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టినా మీరు ఏ మోడ్ ద్వారా పెట్టుబడి పెట్టారనే దాన్ని బట్టి తేడా ఉంటుంది. ముఖ్యంగా వీటి మధ్య కొన్ని ప్రధానమైన తేడాలు ఉన్నాయి. వాటిలో మొదటిది డిస్ట్రిబ్యూటర్. రెగ్యులర్ మోడ్ అంటే మ్యూచువల్ ఫండ్ ను డిస్ట్రిబ్యూటర్ (ఏజెంట్) లేదా బ్రోకర్ ద్వారా కొనుగోలు చేయడం అని అర్థం. ఇందులో ఎక్స్ పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏజెంట్‌కు ఇచ్చే కమీషన్ కూడా కలుస్తుంది. అలాగే మీరు ఫండ్ విత్ డ్రా చేసుకునేటప్పుడు కమీషన్ కారణంగా మీ రిటర్న్స్ కొద్దిగా తగ్గుతాయి. ఇక డైరెక్ట్ విషయానికొస్తే.. ఇక్కడ మీరు ఫండ్ ను AMC (అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ) వెబ్‌సైట్ లేదా Groww, Zerodha వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి నేరుగా కొనుగోలు చేస్తారు. ఇందులో మధ్యవర్తులు ఉండరు. కాబట్టి కమీషన్ ఖర్చు ఉండదు. వచ్చే రాబడిలో కూడా ఎలాంటి కటింగ్ ఉండదు.

రెగ్యులర్ ఫండ్లు ఎప్పుడంటే..
మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి పెద్దగా అనుభవం లేకపోతే మీరు రెగ్యులర్ మోడ్ లో ఫండ్ ను తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూటర్ తగిన సలహా సూచనలు ఇస్తాడు. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ఫండ్ ను ఎంచుకోవడంలో డిస్ట్రిబ్యూటర్ మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే డాక్యుమెంటేషన్ వంటి ప్రాసెస్ లు కూడా అతనే చూసుకుంటాడు.
డైరెక్ట్ ఫండ్లు ఎవరికోసం అంటే..
ఇకపోతే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి నాలెడ్జి ఉండి.. మీరు ఏ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మీకు స్పష్టత ఉంటే మీరు నేరుగా డైరెక్ట్ ఫండ్స్ కొనుగోలు చేయొచ్చు. ఏ ఫండ్ ఎంచుకోవాలి? మీ అవసరాలు, గోల్స్ ఏంటి అనే వాటిపై మీకు పూర్తి అవగాహన అలాగే ఫండ్స్ లోని రకాల గురించి మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ ఫండ్లు ఎంచుకోవచ్చు.
చివరి మాట
ఒక్క ముక్కలో చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు మరొకరి హెల్ప్ అవసరం అనుకుంటే కొంత కమీషన్ ఇచ్చి మీరు అతని సేవలు పొందుతారన్న మాట. ఇదే డైరెక్ట్ కు , రెగ్యులర్ కు ఉన్న తేడా. మీకు ఆర్థిక పరమైన అవగాహన ఉండి, సొంతంగా ఫండ్‌లను ఎంచుకోగలిగే సామర్థ్యం ఉంటే, డైరెక్ట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. లేకపోతే డిస్ట్రి్బ్యూటర్ ద్వారా రెగ్యులర్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి. మీరు ఫండ్ ను ఎంచుకునేటప్పుడు రెగ్యులర్ అన్న ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ కోడ్ అడుగుతుంది. అక్కడ ఆ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications