రెపో రేటు పెంపుతో రూ.15 లక్షల కార్ లోన్‌పై EMI ఎంత పెరుగుతుంది.. పూర్తి కాలిక్యులేషన్ ఇదిగో..

RBI Repo Rate Hike: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటూ రెపో రేటును 0.25 శాతం పెంచి 5.50 శాతానికి చేర్చినట్లు బుధవారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న తొలి నిర్ణయం ఇది కావడం గమనార్హం.

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత పెరగడం లేదా ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా ఉండటం జరుగుతుంది తప్ప, వడ్డీ రేట్ల కోతలు ఉండే ప్రసక్తే లేదని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో గృహ రుణాలతో పాటు కార్ లోన్లపై వడ్డీ రేట్లు పెరిగి నెలవారీ వాయిదాల (EMI) భారం గణనీయంగా పెరగనుంది.

Car Loan EMI Car Loan EMI Increase Repo Rate Hike RBI Repo Rate 15 Lakh Car Loan Car Loan Interest Rate EMI Calculation RBI Rate Hike Car Loan EMI Calculator Floating Rate Car Loan Auto Loan EMI Car Loan Interest Loan EMI Increase RBI MPC Car Loan Cost EMI EMI RBI 15 EMI RBI EMI

కార్ లోన్ ఈఎంఐలపై పడే ప్రభావాన్ని పరిశీలిస్తే.. వినియోగదారులు అదనంగా కొన్ని వేల రూపాయల వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 5 సంవత్సరాల కాలపరిమితికి రూ. 15 లక్షల కార్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. గతంలో ఉన్న 8.40 శాతం ప్రారంభ వడ్డీ రేటు ప్రకారం నెలవారీ ఈఎంఐ రూ. 30,703గా ఉండేది. ఈ ప్రాతిపదికన 5 ఏళ్ల కాలానికి మొత్తం వడ్డీగా రూ. 3,42,153 చెల్లిస్తే, అసలు, వడ్డీ కలిపి మొత్తం చెల్లింపు రూ. 18,42,153 అయ్యేది.

అయితే, ఆర్‌బిఐ రెపో రేటు పెంపును అనుసరించి బ్యాంకులు తమ వడ్డీ రేటును 0.25 శాతం పెంచి 8.65 శాతానికి చేరిస్తే, అదే రూ. 15 లక్షల రుణానికి కొత్త ఈఎంఐ రూ. 30,883కు పెరుగుతుంది. దీనివల్ల వినియోగదారుడిపై నెలకు రూ. 180 అదనపు భారం పడుతుంది. మొత్తం 5 ఏళ్ల రుణ కాలవ్యవధి ముగిసేసరికి కార్ లోన్ దారులు వడ్డీ రూపంలోనే రూ. 3,53,001 చెల్లించాల్సి వస్తుంది, అంటే మొత్తంగా రూ. 10,848 అదనపు భారాన్ని భరించక తప్పదు.

Also Read

మరోవైపు ఆర్‌బిఐ తన ద్రవ్య విధాన వైఖరిని 'క్రమబద్ధమైన కఠినతరం'గా మార్చుకుంది. అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి దశలవారీగా వడ్డీ రేట్లను కఠినతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నందున.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సరాసరి ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతంగా, నాల్గవ త్రైమాసికంలో 5.7 శాతంగా ఉండే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పురోగతిని సాధిస్తోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం నికర వృద్ధిని నమోదు చేయడంతో, 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి (GDP) వృద్ధి రేటు అంచనాను ఆర్‌బిఐ మునుపటి కంటే 0.40 శాతం పాయింట్లు పెంచి 7.1 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. రాబోయే పండుగల సీజన్‌లో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు వివిధ బ్యాంకులు అందించే ప్రారంభ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల తగ్గింపులను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: EMI గణనలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి ప్రస్తుత గణన ఒక అంచనా మాత్రమే. ప్రస్తుత వడ్డీ రేట్లు SBI కార్ లోన్‌లకు ప్రారంభ వడ్డీ రేట్లు. వివిధ బ్యాంకులు, కస్టమర్‌లను బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+