Banks Too Big to Fail: దేశంలో చాలా మంది తమ బ్యాంక్ ఖాతాను తెరవటానికి ముందు వందసార్లు ఆలోచిస్తుంటారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తమకు సమీపంలోని ఏదైనా గ్రామీణ బ్యాంక్ లేదా పోస్టాఫీసు వద్ద డబ్బును పొదుపు చేసుకునేందుకు అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. ప్రభుత్వ హామీ ఉన్న బ్యాంకులు ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటికీ చాలా మంది మన పెద్దవాళ్లు బ్యాంకులను నమ్మటంలో వెనుకడుగువేస్తుంటారు. దానికి కారణం వారి బాల్యంలో నష్టాలతో కనుమరుగైన అనేక బ్యాంకులేనని వారు చెబుతుంటారు.
అయితే ఇప్పుడు ప్రతి ఏటా మాదిరిగానే రిజర్వు బ్యాంక్ దేశంలోని బ్యాంకులకు సంబంధించి ఒక జాబితాను ప్రకటించింది. పతనం అవ్వటానికి ఆస్కారం లేని కొన్ని బలమైన బ్యాంకులకు సంబంధించిన జాబితాను ఈ క్రమంలో ఆర్బీఐ వెల్లడించింది. తాజాగా రిజర్వు బ్యాంక్ డొమెస్టిక్ సిస్టమ్యాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకుల(D-SIB) జాబితాను విడుదల చేసింది. 2023లో మాదిరిగానే జాబితాను సిద్ధం చేసిందని వెల్లడైంది. సిస్టమ్యాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు ఆర్‌బిఐచే గుర్తించబడిన ఆర్థిక సంస్థలు. వీటి పతనం ఆర్థిక సంక్షోభాన్ని ప్రేరేపించటంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయి. అందువల్లనే వీటిని ఆర్బీఐ చేత "too big to fail"గా గుర్తించబడ్డాయి.

దీనిని 2014లో ప్రారంభించిన తర్వాత.. 2015-16లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు జాబితాలో చోటుదక్కించుకున్నాయి. దీని తర్వాత 2017లో స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐతో పాటుగా హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ D-SIB జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తాజా D-SIB రూల్స్ ప్రకారం స్టేట్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సీ ఫ్రేమ్‌వర్క్ కింద ఏప్రిల్ 2025 నుంచి మరింత క్యాపిటల్ మెయిన్టెన్ చేయాల్సి ఉంటుంది.
ఫ్రేమ్‌వర్క్ ప్రకారం నియమించబడిన బ్యాంకులు వాటి వ్యవస్థాగత ప్రాముఖ్యతను బట్టి తగిన బకెట్లలో ఉంచబడతాయి. అధిక బకెట్‌కు రుణదాత ఇతర ఫైనాన్స్ మెట్రిక్స్ కాకుండా పెద్ద క్యాపిటల్ బఫర్‌ను నిర్వహించడం అవసరం. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ క్యాపిటల్ అవసరాలు గతంలో ఉన్న 60 శాతం నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచబడి 80 శాతానికి చేర్చబడిందని ఆర్బీఐ పేర్కొంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం క్యాపిటల్ అవసరాలను 20 శాతం నుంచి 40 శాతానికి పెంచుతుందని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ 20 శాతం మూలధన అవసరాన్ని నిర్వహించాల్సి ఉంటుందని భారతీయ సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో తేటతెల్లం చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకులు ఖాతాలు తెరవటానికి అత్యంత సురక్షితమైనవిగా పేర్కొనబడ్డాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications