RBI News: ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయటం వంటివి సర్వ సాధారణంగా మారిపోయింది. చాలా మంది మోసగాళ్లు సోషల్ మీడియా వేదికత తమ ప్రతిభను ప్రజలను మోసం చేయటానికి వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో ఆర్థిక సంస్థలు, రిజర్వు బ్యాంక్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలను మోసం చేయటానికి సైబర్ నేరగాళ్లు కొత్త ఆలోచనలతో వస్తూనే ఉన్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన ఉన్నతాధికారులతో కూడిన డీప్‌ఫేక్ వీడియోల సర్క్యులేషన్ గురించి హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో కూడిన డీప్‌ఫేక్ వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండటంతో చాలా మంది వాటిని నిజమైనవిగా భావిస్తున్నారు. వాటిలో ప్రజలు నమ్మేవిధంగా మోసగాళ్లు ఏఐ సాంకేతికతను వినియోగించి తప్పుడు వీడియోలను తయారు చేస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది. కొన్ని పెట్టుబడి పథకాల్లో ప్రజలను ఇన్వెస్ట్ చేయాలని ఆర్బీఐ సూచిస్తున్నట్లుగా సదరు వీడియోలు పెట్టుబడిదారులకు ఎండార్స్ చేస్తున్నట్లు గుర్తించబడింది. ఈ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించటానికి ఉపయోగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ హెచ్చరిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నిజమేనని భావించి మోసగాళ్ల చేతిలో ప్రజలు చిక్కటాన్ని అరికట్టాలని సెంట్రల్ బ్యాంక్ పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఈ వీడియోల ఆధారంగా పెట్టుబడి ఎంపికలను చేయకుండా వారిని హెచ్చరిస్తుంది. వీడియోల్లో చేసిన క్లెయిమ్‌లలో అధికారులెవరూ పాల్గొనలేదని, ఆర్బీఐకి వాటితో ఎలాంటి సంబంధం లేదని తాజాగా ప్రకటిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ బ్యాంక్ సూచిస్తోంది. సోషల్ మీడియాలో ఆర్‌బీఐ గవర్నర్‌కు సంబంధించిన నకిలీ వీడియోలు ప్రచారం అవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి వచ్చినట్లు తన ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఇలాంటి పెట్టుబడి సూచనలు ఇప్పటి వరకు ఎక్కడా చేయలేదని, ఇవి పూర్తిగా ఏఐ వినియోగించి తయారు చేసిన తప్పుడు వీడియోలుగా దృవీకరిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
దీనిద్వారా అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. రిజర్వు బ్యాంక్ ఎవ్వరికీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి పెట్టుబడి సలహాలు లేదా సూచనలు అందించదు. ప్రజలు మారిన టెక్నాలజీతో జరుగుతున్న డీప్ ఫేక్ వీడియో మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ విజ్ఞప్తి చేస్తోంది. పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడానికి/మద్దతు ఇవ్వడానికి స్కామర్‌లు ఉన్నత అధికారుల నకిలీ వీడియోలను ఉపయోగించడం ఇదే మొదటి సంఘటన కాదని.. జూలైలో ఇదే విధమైన కేసులు బయటపడ్డాయి. అయితే అప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సీఈవో, ఎండీలకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలపై చర్య తీసుకోవాలని బాంబే హైకోర్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. ప్రజలు అన్ని రకాల ప్రభుత్వ సంస్థలను ఇలా ఏఐ సాంకేతికతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వినియోగిస్తున్న వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
ఈ వీడియోలు ప్రజలకు ఆర్థిక పరమైన నష్టాలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో వీడియోలను ప్రజల నుంచి డేటాను తస్కరించటానికి మోసగాళ్లు వాడుతున్నట్లు గుర్తించబడింది. అలాగే స్కామర్లు ప్రభుత్వ సంస్థలు, అధికారులపై నమ్మకాన్ని పోగొట్టడానికి సైతం వీటిని వినియోగిస్తున్నట్లు తేలింది. అందువల్ల వీరికి వ్యక్తిగత వివరాలను షేర్ చేయటం, సోషల్ మీడియాలో అనధికారిక ఖాతాల్లో అందించే వివరాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అనుమానం వచ్చినప్పుడు వీటిపై అధికారులకు లేదా పోలీసులకు కంప్లెయింట్ చేయటం మంచిదని నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications