బెస్ట్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవే.. ఫిబ్రవరిలో రెపో రేటు పెంచే అవకాశం
హోమ్ లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం పదేళ్ల కనిష్టం వద్ద ఉన్నాయి. ఇంటి కోసం రుణం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా, పంజాబ్ సింద్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, ఐడీబీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకుల్లో వరుసగా కనిష్టం 6.40 శాతం నుండి 6.90 శాతం వరకు ఉన్నాయి.
సాధారణంగా ఎవరికైనా అత్యంత పెద్ద రుణం హోమ్ లోన్. లోన్ పరంగా మాత్రమే కాకుండా కాలపరిమితి పరంగా కూడా ఇది ఎక్కువ కాలం ఉంటుంది. హోమ్ లోన్ కాలపరిమితి కనీసం పదిహేనేళ్లు ఉంటుంది. హోమ్ లోన్ దీర్ఘకాలపు రుణం కాబట్టి మీరు తీసుకున్న మొత్తంకంటే రెండింతలు, అంతకంటే ఎక్కువగా చెల్లించాల్సి రావొచ్చు. అయితే అందుబాటులో ఉన్న రుణాల్లో హోమ్ లోన్ చౌక.

హోమ్ లోన్ ప్రయోజనకరం
దీర్ఘకాలంలో హోమ్ లోన్ ఎంతో ప్రయోజనకరం. మీరు నివసించాలని భావిస్తే ఇంటిని కొనుగోలు చేయడం ఉత్తమమైన ఎంపికగా భావించవచ్చు. దేశంలో చాలా వరకు హౌసింగ్ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. కాబట్టి రెడీ టు హోమ్స్ కొనుగోలు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పలు బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పలు బ్యాంకుల్లో దశాబ్దాల కనిష్టం వద్ద ఉన్నాయి. క్రెడిట్ స్కోర్, కాలపరిమితి, లోన్ హిస్టరీ, క్రెడిట్ హిస్టరీ వంటి అంశాలపై హోమ్ లోన్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.40 శాతం నుండి 7.40 శాతం మధ్య ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50 శాతం నుండి 8.10 శాతం మధ్య ఉంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50 శాతం నుండి 8.85 శాతం మధ్య ఉంది.
కొటక్ మహీంద్రా బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.55 శాతం నుండి 7.20 శాతం మధ్య ఉంది.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.60 శాతం నుండి 7.60 శాతం మధ్య ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.60 శాతం నుండి 7.85 శాతం మధ్య ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం నుండి 6.90 శాతం మధ్య ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం నుండి 7.55 శాతం మధ్య ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం నుండి 7.65 శాతం మధ్య ఉంది.
ఐడీబీఐ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం నుండి 9.90 శాతం మధ్య ఉంది.
యాక్సిస్ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం నుండి 7.10 శాతం మధ్య ఉంది.
ఇండియన్ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం నుండి 7.70 శాతం మధ్య ఉంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం నుండి 9.55 శాతం మధ్య ఉంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం నుండి 7.30 శాతం మధ్య ఉంది.

వడ్డీ రేటు తగ్గింపు
భారత్‌లో ఆర్థిక రికవరీ వేగవంతమైందని, వచ్చే ఏడాది ప్రారంభంలో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2022 ఫిబ్రవరిలో జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ సందర్భంగా వడ్డీ రేటును సవరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది.


Click it and Unblock the Notifications