RBI News: దేశంలోని బ్యాంకుల పనితీరును, వాటి సెలవులు వంటి అన్ని అంశాలను రిజర్వు బ్యాంక్ నియంత్రిస్తుంది. వాస్తవానికి మార్చిలో మిగిలిన 10 రోజుల్లో బ్యాంకులు 6 రోజుల పాటు మూతపడాల్సి ఉంది. అయితే వీటిలో మార్పులను ఆర్బీఐ ప్రకటించింది.
మార్చి 31, 2024న ప్రభుత్వ పనుల కోసం తమ శాఖలను తెరవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. వాస్తవానికి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు పైగా ఆదివారం కావటంతో ప్రత్యేకంగా ప్రకటన వెలువరించింది. దీని వల్ల ప్రభుత్వానికి చెందిన అన్ని చెల్లింపులకు, రసీదులకు సంబంధించిన అన్ని శాఖలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్లియర్ చేయబడతాయి. ప్రభుత్వ లావాదేవీల ఖాతాలను నిర్వహించవచ్చని ఆర్‌బీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన అన్ని శాఖలను మార్చి 31, 2024 తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు సూచించబడింది.

మార్చి 25న హోలీ సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీనికి తోడు వారపు సెలవుల కారణంగా ఆదివారం అంటే మార్చి 24న బ్యాంకులు మూసివేయబడతాయి. శనివారం మార్చి 23 నాల్గవ శనివారం. అందువల్ల బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చి 22న బీహార్ దినోత్సవం సందర్భంగా అక్కడి బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే 26,27న పాట్నా, భువనేశ్వర్, ఇంపాల్‌లలో సెలవు ఉంటుంది. దీనికి తోడు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్చి 29న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఇక ఏప్రిల్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా బ్యాంకులు 1న మూతపడనున్నాయి. బాబు జగ్జీవన్ రామ్ జయంతి/జుమాత్-ఉల్-విదా కారణంగా ఏప్రిల్ 5న బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 9 నవరాత్రుల మొదటి రోజు. ఈ రోజు కూడా గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినం/సాజిబు నొంగ్మపన్బా (చెయిరోబా) కాబట్టి ఏప్రిల్ 9న బ్యాంకులు మూతపడతాయి. అలాగే ఏప్రిల్ 10న చంద్రుడు కనిపిస్తో తర్వాతి రోజున ఈద్ కారణంగా బ్యాంకులకు సెలవు. అలాగే ఏప్రిల్ 13, 15, 17, 20న కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications