Bank Loan: బ్యాంకుల తోక కత్తిరించిన RBI.. రుణ గ్రహీతలకు శుభవార్తే.. కొత్త రూల్ వివరాలివే..
Loan Details: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా పరిపక్వత చెందుతున్న ఇండియా బ్యాంకింగ్ విధానాన్ని రిజర్వు బ్యాంక్ సమర్థవంతంగా నడిపిస్తోంది. ఈ క్రమంలో ట్రాన్ఫరెన్సీని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు అందించే రుణాల విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలుచేస్తోంది. అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తున్న వీటి ప్రకారం ఇకపై.. దేశంలోని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లోన్స్ విషయంలో.. రుణ వడ్డీతో పాటు ఇతర ఖర్చులతో సహా రుణాలు తీసుకునే ఖాతాదారులందరికీ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తప్పక అందించాల్సిందేనని సోమవారం ప్రకటించింది. ఇది వ్యవస్థలో మరింత ట్రాన్ఫరెన్సీకి దారితీయటంతో పాటు రుణ గ్రహీతలకు పూర్తి వివరాలు అందేలా చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చాలా కంపెనీలు గోల్డ్ లోన్స్ విషయంలో కస్టమర్ల నుంచి వివిధ రకాల పేరుతో అధిక మెుత్తాలను వసూలు చేస్తున్నట్లు ఇటీవల రిజర్వు బ్యాంక్ తనిఖీల్లో వెల్లడైన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులను నివారించటంతో పాటు.. ఆర్‌బీఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల ఉత్పత్తుల్లో పారదర్శకతను పెంచేందుకు, సమాచార లోపాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. రుణం తీసుకునే కస్టమర్లు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పాటు అందిస్తుంది. తాజా ఆదేశాలు ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు ఇచ్చే రిటైల్, MSME టర్మ్ లోన్‌లకు వర్తిస్తుంది.
KFS అంటే సాధారణ భాషలో రుణ ఒప్పందం. ఇది వినియోగదారులు తీసుకున్న రుణానికి సంబంధించిన అన్ని ప్రధాన విషయాలను కలిగి ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇది కస్టమర్‌కు ఇవ్వబడుతుంది. వాస్తవ ప్రాతిపదికన థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల తరపున రుణగ్రహీతలకు సెంట్రల్ బ్యాంక్ పరిధిలోని సంస్థలు విధించే బీమా, లీగల్ ఫీజులు వంటి మొత్తాలు కూడా వార్షిక శాతం రేటు(APR)లో భాగంగా ఉంటాయని రిజర్వు బ్యాంక్ తెలిపింది.


Click it and Unblock the Notifications