RBI News: లోన్ EMI చెల్లింపుదారులకు శుభవార్త.. బ్యాంకుల ఆటలకు RBI చెక్..!!
RBI Loan Guidelines: రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా శక్తికాంత దాస్ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అలసత్వానికి అస్సలు తావులేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఆయన. పైగా బ్యాంకుల ఆటలకు చెప్ పెడుతూ వినియోగదారులకు న్యాయం జరిగేలా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నారు.
యూపీఐ విజయవంతం నుంచి నిబంధనలు పాఠించని సంస్థలపై ఉక్కుపాదం వరకు అనేక మార్పులు దాస్ నేతృత్వంలో జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా.. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వ్యక్తులకు పెద్ద ఊరటను ఇచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు రుణ ఖాతాలపై జరిమానా విధించే విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపు గడువు నాటికి డిఫాల్ట్ లేదా ఇతర రుణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రుణగ్రహీతలపై అదనపు జరిమానాలు విధించేందుకు అనుమతించబడవు.

నెలవారీ చెల్లించాల్సిన EMI మెుత్తాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి జరిమానా విధిస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే ఆర్‌బీఐ కొత్త ఆదేశాలతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలను జరిమానా వడ్డీని వసూలు చేయకుండా నిలిపివేసింది. లోన్ డిఫాల్ట్ సమయంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించటాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. అయినప్పటికీ బ్యాంకులు ఇప్పటికీ జరిమానాలు విధించవచ్చు. పెనాల్టీ ఛార్జీలపై ఎలాంటి అదనపు వడ్డీని వసూలు చేయవద్దని బ్యాంకులను కోరింది.
వాస్తవానికి పెనాల్టీ ఉద్దేశ్యం క్రెడిట్ క్రమశిక్షణకు సంబంధించినదిగా రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దీనిని ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగించటాన్ని తప్పుపట్టింది. ఈ క్రమంలో బ్యాంకులు అండ్ ఫైనాన్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి పెనాల్టీలు, ఇతర ఛార్జీలు విధిస్తున్నట్లు గమనించింది. పైగా ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు పెరగటంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది.
రిజర్వు బ్యాంక్ ప్రకారం ఈ మార్గదర్శకాలు అన్ని కొత్త రుణాలకు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న అన్ని రుణాలకు జూన్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీనికి ముందు గతంలో రిజర్వు బ్యాంక్ అమలు తేదీని జనవరి 1 నుంచి ఏప్రిల్ 1కి మార్చిన సంగతి తెలిసిందే. ఈ మార్గదర్శకాలు రిటైల్, కార్పొరేట్ రుణాలకు ఒకే విధంగా ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications