బ్యాంక్ ఖాతా లేకపోయినా రూ.50 వేల వరకు మనీ పంపుకోవచ్చు.. RBI కొత్త రూల్స్‌ గురించి ఓ సారి తెలుసుకోండి..

RBI Money Transfer Rules 2026: దేశీయ నగదు బదిలీ (DMT) నిబంధనలను మరింత సులభతరం చేస్తూ.. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం నాడు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలు అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రస్తుత నిబంధనలను ఏకీకృతం చేస్తూ కేంద్ర బ్యాంకు ఈ కీలక ఆదేశాలను వెలువరించింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు ఖాతా లేని సామాన్య పౌరులు సైతం నేరుగా ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సదుపాయం ద్వారా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు రూ. 50,000 వరకు నగదును సులభంగా బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు.

అదేవిధంగా బ్యాంకు ఖాతా లేని వ్యక్తులకు నిధులు పంపే 'నగదు చెల్లింపు' (Cash Pay-out) సేవలకు సంబంధించి కూడా ఆర్బీఐ స్పష్టమైన పరిమితులను విధించింది. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత ఖాతాల నుండి బ్యాంకు ఖాతా లేని వ్యక్తులకు నగదును బదిలీ చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. ఇలా పంపిన నగదును స్వీకర్తలు సమీపంలోని ఏటీఎంల ద్వారా గానీ, బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్లు (BC) లేదా ఇతర అధీకృత చెల్లింపు కేంద్రాల ద్వారా గానీ నేరుగా నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ నగదు చెల్లింపు సదుపాయం కింద ప్రతి ఒక్క లావాదేవీకి గరిష్ట పరిమితిని రూ. 10,000గా అలాగే ఒక లబ్ధిదారుడు నెలవారీగా పొందే మొత్తం నగదు పరిమితిని రూ. 25,000గా కేంద్ర బ్యాంకు నిర్ధారించింది.

RBI money transfer rules 2026 RBI domestic money transfer guidelines 50 000 NEFT without bank account cash NEFT transfer RBI new guidelines domestic money transfer walk-in NEFT customers cash remittance rules RBI banking news NEFT transaction limit cash payout limit migrant workers money transfer RBI November 2026 rules RBI RBI NEFT 50 000 NEFT RBI

నగదు బదిలీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ కఠినమైన కేవైసీ నిబంధనలను తప్పనిసరి చేసింది. నగదు పంపే బ్యాంకులు, బిజినెస్ కరస్పాండెంట్లు 'మీ కస్టమర్‌ను తెలుసుకోండి' (KYC) ఆదేశాలు.. 2025కు అనుగుణంగా వినియోగదారులను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నగదు పంపే వ్యక్తికి సంబంధించిన ధృవీకరించబడిన మొబైల్ నంబర్‌తో పాటు, స్వీయ-ధృవీకరణ చేసిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని (OVD) సమర్పించడం తప్పనిసరి. అంతేకాకుండా ప్రతి నగదు బదిలీ లావాదేవీని అదనపు ప్రమాణీకరణ అంశం (AFA) ద్వారా ధృవీకరించిన తర్వాతే పూర్తి చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Also Read

డిజిటల్, నగదు చెల్లింపుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు, బ్యాంకింగేతర చెల్లింపు ఆపరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర బ్యాంకు ఆదేశించింది. లావాదేవీల వేగం, తరచుదనాన్ని పర్యవేక్షించే 'వెలాసిటీ చెక్స్' వ్యవస్థను అమలు చేయడంతో పాటు, నగదు జమ అయిన వెంటనే వినియోగదారులకు తక్షణ హెచ్చరిక సందేశాలను పంపాలి. ఏదైనా ఒక ఖాతాలోకి లేదా ఖాతాల సమూహంలోకి అసాధారణ రీతిలో నిధులు జమ అవుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత సంస్థలు తక్షణమే విచారణ చేపట్టి, అనుమానాస్పద లావాదేవీల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలని ఆర్బీఐ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+