దేశంలో డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. షాపింగ్ నుండి బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, ప్రయాణ ఖర్చులు ఇలా ఏ విషయమైనా క్రెడిట్ కార్డు వాడకం సాధారణమైంది. అయితే, ఇలాంటి సౌకర్యాల మధ్య కస్టమర్లకు అత్యంత చికాకు కలిగించే అంశం ఓవర్‌లిమిట్ ఛార్జీలు.
అనేక మంది తెలియకుండానే తమ కార్డు పరిమితిని మించి ఖర్చు చేస్తారు, అనంతరం బ్యాంకులు విధించే భారీ రుసుములతో ఇబ్బందులు పడుతుంటారు. పెరుగుతున్న ఫిర్యాదులు, వినియోగదారుల అసంతృప్తి దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు ఓవర్‌లిమిట్ నియంత్రణను తప్పనిసరి చేస్తూ.. అనుమతి లేకుండా విధించే ఛార్జీలను పూర్తిగా నిషేధించింది.

ఇప్పటి వరకు అనేక బ్యాంకులు కస్టమర్‌కు సమాచారం ఇవ్వకుండా, వారి స్పష్టమైన అనుమతి లేకుండా ఓవర్‌లిమిట్ ఫీచర్‌ను ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేసేవి. ఫలితంగా వినియోగదారులు అనుకోకుండా కార్డు పరిమితిని మించిపోయి, కొన్ని సందర్భాల్లో వేల రూపాయల ఓవర్‌లిమిట్ ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని ముగిస్తూ RBI కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై ఏ కార్డ్ జారీదారుడూ కస్టమర్ అనుమతి లేకుండా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయకూడదు. కస్టమర్ ఆమోదం స్పష్టంగా రికార్డు చేసినపుడే ఓవర్‌లిమిట్ సౌకర్యం అమల్లోకి వస్తుంది.
ఇకపోతే వినియోగదారులకు నియంత్రణను పూర్తిగా ఇవ్వడంలో భాగంగా, RBI యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఓవర్‌లిమిట్ ఆన్/ఆఫ్ చేసే సదుపాయాన్ని అందించాలని బ్యాంకులకు ఆదేశించింది. అంటే కస్టమర్ తన కార్డు సెట్టింగ్స్‌లో ఒక క్లిక్‌తో ఓవర్‌లిమిట్‌ను అనుమతించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. ఈ ఫీచర్ 24 గంటలూ అందుబాటులో ఉండాలని RBI స్పష్టం చేసింది.
కొత్త విధానం ప్రకారం కస్టమర్ ఓవర్‌లిమిట్‌ను ఆమోదించకపోతే.. ఏ పరిస్థితుల్లోనూ పరిమితికి మించి లావాదేవీ జరగకూడదు. సాంకేతిక లోపం వంటి కారణాలవల్ల ట్రాన్సాక్షన్ పరిమితిని మించిపోయినా, బ్యాంకులు ఒక్క రూపాయి ఓవర్‌లిమిట్ ఛార్జీ కూడా వసూలు చేయరాదు. ఇది అనుకోకుండా ఎక్కువగా ఖర్చు చేసే వినియోగదారులకు పెద్ద ఉపశమనం. ఈ నియమం ఆర్థిక మోసాలను అరికట్టడమే కాకుండా, వినియోగదారుల్లో బాధ్యతాయుత ఖర్చు సంస్కృతి పెరగడానికి దారితీయాలని RBI పేర్కొంది. అనేక సందర్భాల్లో ఓవర్‌లిమిట్ సౌకర్యం అనవసర ఖర్చులకు కారణమవుతూ, ఆర్థిక ఒత్తిడిని పెంచేదని RBI విశ్లేషించింది.
ఉదాహరణకు, మీ కార్డు పరిమితి రూ. 1 లక్ష అనుకుందాం. ఓవర్‌లిమిట్ ఫీచర్ యాక్టివ్‌లో ఉంటే, మీరు రూ. 1 లక్షకు మించి కూడా ఖర్చు చేయగలరు. కానీ ఆ ఫీచర్‌ను ఆఫ్ చేసి ఉంటే, మీ వ్యయం పరిమితిని చేరిన వెంటనే లావాదేవీ రద్దు అవుతుంది. అలా జరగకపోయి, బ్యాంక్ మీ అనుమతి లేకుండా రుసుము విధిస్తే, కస్టమర్ ముందుగా బ్యాంక్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కరించకపోతే RBI అంబుడ్స్‌మన్ పోర్టల్‌లో కంప్లైంట్ పెట్టవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం, కస్టమర్‌కు పూర్తిగా రిఫండ్ వచ్చే హక్కు ఉంటుంది.
RBI ఈ నిర్ణయంతో.. కోట్లాది Credit Cards వినియోగదారులు ఇక అనవసర ఛార్జీలు, మోసాలు, తెలియకుండానే లిమిట్ దాటడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందనున్నారు. ఈ చర్య బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంపొందిస్తూ, కస్టమర్ హక్కులను మరింత బలపరుస్తుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications