RBI Repo Rate: అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిస్థితులతో పాటు, దేశీయ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిల్లో ఉన్న వేళ రిజర్వుబ్యాంక్ తన వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది.ఈ క్రమంలో ఎంపీసీ కీలక వడ్డీ రేట్లను ఏప్రిల్ 2023 నుంచి ఎటువంటి మార్పులు లేకుండా 6.5 శాతం వద్ద కొనసాగిస్తోంది. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల తగ్గింపుల తర్వాత దేశీయంగా ప్రజలు సైతం వడ్డీ రేట్ల తగ్గింపును ఆశించారు.
ప్రస్తుత పరిణామాల ప్రకారం రెపో రేటు తగ్గింపు డిసెంబరు సమావేశంలో ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఓటు వేసినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్బీఐ వెల్లడించిన రేట్లు గుడ్ రిటర్న్ నిర్వహించిన పోల్ కి అనుకూలంగా ఉన్నాయి. అటు ద్రవ్యోల్బణంతో పాటు ఇటు వృద్ధి రేటును బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈసారి కూడా రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా, అసమానంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వినియోగం మెరుగుపడుతోందన్న దాస్ మెుదటి త్రైమాసికంలో 8 ప్రధఆన పరిశ్రమల ఉత్పత్తి 1.8 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వృద్ధి అంచనాలపై మాట్లాడుతూ FY25 మెుదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండవ త్రైమాసికంలో 7 శాతం, మూడవ త్రైమాసికంలో 7.4 శాతం, నాల్గవ త్రైమాసికంలో 7.4 శాతం వద్ద ఉంటుందని అంచనాలను ప్రకటించారు. ఇదే క్రమంలో FY 26 మెుదటి త్రైమాసికంలో వృద్ధిని 7.3 శాతం ఉండవచ్చని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణంపై స్పందిస్తూ అంతర్జాతీయంగా, దేశీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని మూడవ త్రైమాసికంలో ఇది స్వల్పంగా పెరిగి 4.8 శాతంగా ఉండవచ్చని చెప్పారు. అలాగే నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గి 4.2 శాతానికి చేరుకుంటుందని అన్నారు.
ప్రస్తుత ప్రకటనను చూస్తుంటే.. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇజ్రాయెల్ హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం చేయడంతో పాటు ఏకకాలంలో ఇరాన్‌తో వైమానిక దాడులకు దిగడం వంటి కారణాల వల్ల సరఫరా గొలుసు అంతరాయానికి సంబంధించిన ఆందోళనల కారణంగా RBI విధాన నిర్ణయం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య ఉంది. అలాగే యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు గత నెలలో వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత వచ్చిన మెుదటి ఆర్బీఐ ఎంపీసీ పాలసీలో రేట్ల తగ్గింపులు ఆశించినప్పటికీ అది కనిపించలేదు. దీని కారణంగా రుణాలపై ఈఎంఐలు చెల్లిస్తున్న వ్యక్తులకు ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications