SBI News: దేశంలోని అన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ కంపెనీల సమ్మతిని ఆర్‌బీఐ చురుకుగా పర్యవేక్షిస్తోంది. దీనికి ముందు ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా.. నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంకులపై రూ.3 కోట్ల వరకు జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. 2014 డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వు బ్యాంక్ తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.2 కోట్ల జరిమానా విధించింది.

అదే విధంగా క్రెడిట్ వర్గీకరణ నిబంధనలు & కస్టమర్ సైన్స్ విధానాలపై RBI మార్గదర్శకాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్‌కు రూ.66 లక్షల జరిమానా విధించబడింది. ఇక చివరగా ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంకుకు రూ.32.30 లక్షల జరిమానా విధించింది. ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న ఓషన్ క్యాపిటల్ మార్కెట్స్ అనే ఆర్థిక సంస్థ రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు రూ.16 లక్షల జరిమానా విధిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా ప్రకటించింది. అయితే ఈ జరిమానాలు సంస్థలు తమ కస్టమర్లతో జరిపిన లావాదేవీలు మరియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటించకపోవడంతో గత నెల రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బోర్డు డైరెక్టర్ల పదవి నుంచి పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోమవారం రాజీనామా చేశారు. భారతదేశపు మూడవ అతిపెద్ద UPI చెల్లింపు ఆపరేటర్ అయిన పేటీఎం, దాని UPI లావాదేవీలను కొనసాగించడానికి యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లతో జతకట్టాలని యోచిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications