RBI Fine: దేశీయ బ్యాంకింగ్ కంపెనీలను రిజర్వు బ్యాంక్ ఎల్లప్పుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రూల్స్ పాటించనప్పుడు వాటిపై భారీగా పెనాల్టీలు వేస్తూనే ఉంటుంది. తప్పు చిన్నదే అయినప్పటికీ ఖరీదు మాత్రం ఎక్కువగా చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ మరో సారి బ్యాంకింగ్ సంస్థలకు తాజా చర్యలతో చెప్పకనే చెప్పింది.
తాజాగా ఆర్బీఐ కొన్ని నియంత్రణ సూచనలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. దీంతో యాక్సిస్ బ్యాంకుకు రూ.1.91 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి రూ.కోటి రెగ్యులేటర్ జరిమానా విధించింది. మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితిని పరిశీలించిన పర్యవేక్షక అంచనా (ISE 2023) కోసం చట్టబద్ధమైన తనిఖీ ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్‌పై ఈ జరిమానా విధించింది. ఈ తనిఖీలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని అనేక ఉల్లంఘనలు వెల్లడయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే యాక్సిస్ బ్యాంక్ అర్హత లేని సంస్థల కోసం సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలను తెరిచినట్లు ఆర్బీఐ గుర్తించింది. అలాగే రూ.1.60 లక్షల వరకు వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేక కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోడ్ అందించడంలో బ్యాంక్ విఫలమైందని సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేసింది. ఇది బ్యాంకింగ్ కంపెనీకి ఆమోదయోగ్యమైన వ్యాపార కార్యకలాపం కాదని ఆర్భీఐ వెల్లడించింది.
ఇక మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విషయానికి వస్తే.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు, బ్యాంకులు నియమించిన రికవరీ ఏజెంట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సేవా ప్రమాణాలకు సంబంధించి ఆర్బీఐ నిర్దిష్ట ఆదేశాలను పాటించనందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు కోటి రూపాయల జరిమానా విధించబడింది. జీవిత బీమా కవరేజీ కోసం మొదటి సంవత్సరం ప్రీమియం కోసం రూ.250 కంటే ఎక్కువ చెల్లించడం వంటి బహుమతులు అందించడంతోపాటు పలు ఉల్లంఘనలు జరిగినట్లు తనిఖీలో వెల్లడైంది. HDFC బ్యాంక్ కూడా అనర్హమైన ఎంటిటీల కోసం ఖాతాలను తెరిచిందని, అనుమతించబడిన సమయాల వెలుపల కస్టమర్ సంప్రదింపు మార్గదర్శకాలను అనుసరించలేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ చర్యల ప్రభావం బుధవారం స్టాక్ మార్కెట్లలో రెండు కంపెనీల షేర్లపై ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications