RBI News: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి షాక్.. కన్నెర్ర చేసిన రిజర్వు బ్యాంక్..
Punjab National Bank: దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని డేక కళ్లతో ఎల్లప్పుడూ రిజర్వు బ్యాంక్ కనిపెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం నేరుగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని కంపెనీలపై కఠినంగా వ్యవహరించిన తీరు మనం ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాం.
వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీ విధిస్తున్నట్లు జూలై 5న ప్రకటించింది. నిబంధనలు పాటించనుందుకు గాను రూ.1.32 కోట్ల భారీ జరిమానాను విధించింది. రాయితీలు/రీఫండ్‌లు/రీయింబర్స్‌మెంట్‌ల ద్వారా ప్రభుత్వం నుంచి స్వీకరించదగిన మొత్తాలకు వ్యతిరేకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్‌లకు బ్యాంకు వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ రుణాలను మంజూరు చేసినందుకు గాను పెనాల్టీ విధించబడిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అంతేకాకుండా కొన్ని ఖాతాల్లో వ్యాపార సంబంధాల సమయంలో పొందిన కస్టమర్ల గుర్తింపు , వారి చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో కూడా ప్రభుత్వ బ్యాంక్ విఫలమైందని రిజర్వు బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించిన పర్యవేక్షక మూల్యాంకనం(ISE 2022) కోసం చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ RBI ఆదేశాలను, దానికి సంబంధించిన సంబంధిత కరస్పాండెన్స్‌లను పాటించడం లేదని పర్యవేక్షక నిర్ధారణల ఆధారంగా నోటీసు పంపబడింది. పెనాల్టీ ఎందుకు విధించకూడదో కారణం చూపాలంటూ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది.
అయితే శుక్రవారం బ్యాంకింగ్ స్టాక్ ఎన్ఎస్ఈలో ముగింపు సమయం నాటికి 1.05 శాతం లాభపడి రూ.122.80 రేటు వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందు కంపెనీ తన మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీని ప్రకారం బ్యాంక్ గ్లోబల్ వ్యాపారం వార్షిక ప్రాతిపదికన 10.3 శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications