RBI Action: దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల పనితీరుపై రిజర్వు బ్యాంక్ పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఉంటుందని మనందరికీ తెలిసిందే. పైగా ఇటీవల్ ఆర్బీఐ ఈ సంస్థల్లో జరుగుతున్న తప్పిదాపై చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటూ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సెంట్రల్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు IDFC ఫస్ట్ బ్యాంక్, LIC హౌసింగ్ ఫైనాన్స్‌పై చర్యలు తీసుకుంది. వాటిపై ఆర్థిక జరిమానాలు విధించింది. రూల్స్ వైలేషన్ కారణంగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై రూ.కోటి, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌పై రూ.49.70 లక్షలు జరిమానాగా ఆర్‌బీఐ విధించింది. దీనిపై రిజర్వు బ్యాంక్ ప్రకటన ప్రకారం.. రుణాలకు సంబంధించిన కొన్ని సూచనలను పాటించనందుకు IDFC ఫస్ట్ బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు తెలిపింది. రెండు కంపెనీలకు ఆర్‌బీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ విధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు - హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మార్గదర్శకాలు-2021 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్‌పై పెనాల్టీ విధించబడింది. అయితే పెనాల్టీలు ఈ బ్యాంక్ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ దేశంలో వ్యాపారం నిర్వహిస్తున్న 4 NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను రద్దు చేసింది.
రిజిస్ట్రేషన్ రద్దైన NBFCల జాబితాలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్, పంజాబ్‌కు చెందిన భాటియా హైర్ పర్చేజ్, హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన జీవనజ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ తాజా చర్యల కారణంగా ఈ నాలుగు సంస్థలు ఇకపై వ్యాపారం చేయటం కుదరదని తెలుస్తోంది.
5 ఎన్‌బీఎఫ్‌సీలు-గ్రోయింగ్ ఆపర్చునిటీ ఫైనాన్స్ ఇండియా, ఇన్‌వెల్ కమర్షియల్, మోహన్ ఫైనాన్స్, సరస్వతి ప్రాపర్టీస్ అండ్ క్వికర్ మార్కెటింగ్‌లు తమ లైసెన్సులను సరెండర్ చేశాయని ప్రత్యేక నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications