RBI News: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పులు నిజమే.. ఆర్బీఐ ఏం చేసిందంటే?
Central Bank of India: దేశంలోని బ్యాంకింగ్ సంస్థల పనితీరులోని లోపాలను రిజర్వు బ్యాంక్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. తదనుగుణంగా క్షమశిక్షణా చర్యల్లో భాగంగా తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సోనాలీ బ్యాంక్ లకు పెద్ద ఎదురుదెబ్బ తిన్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కన్నెర్ర చేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. 'అప్పులు & అడ్వాన్సులు', 'కస్టమర్ ప్రొటెక్షన్'కు సంబంధించిన నిబంధనలు పాటించటంలో వైఫల్యం చెందినందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ ఏకంగా రూ.1.45 కోట్లను జరిమానాగా విధించింది. చట్టపరమైన ఆర్బీఐ తనిఖీల్లో గుర్తించిన తప్పిదాలు నిజమేనని రుజువయ్యాయి.

ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలను పాటించడంలో విఫలమైనందుకు దానిపై ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరుతూ ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. బ్యాంకు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన ఆర్‌బీఐ బ్యాంకుపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీగా పొందిన మొత్తానికి బదులుగా బ్యాంకు ఒక కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ రుణాన్ని మంజూరు చేసింది. దీనితో పాటు, కొన్ని అనధికార ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో బ్యాంకు ఖాతాదారుల ఖాతాలలోకి చేరిన మొత్తాన్ని నిర్ణీత గడువులోగా జమ చేయలేకపోయినట్లు సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది.
సోనాలి బ్యాంక్:
మరో ప్రకటనలో.. KYC ఆదేశాలు, 2016తో సహా కొన్ని నిబంధనలను పాటించనందుకు సోనాలి బ్యాంక్ Plcపై రూ.96.4 లక్షల జరిమానా విధించినట్లు RBI తెలిపింది. రెండు కేసుల్లో విధించిన జరిమానాలు రెగ్యులేటరీ సమ్మతి లోపాలపై ఆధారపడి ఉన్నాయని, సంస్థలు తమ కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుపై తీర్పు ఇవ్వడానికి ఉద్దేశించినవి కాదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్:
యాక్సిస్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ.1.66 కోట్లకు పైగా జరిమానా విధించింది. యాంటీ టెర్రరిస్ట్ కమాండో ఫోర్స్ ఎన్‌ఎస్‌జీ పేరుతో మోసపూరిత ఖాతాను తెరవడం ద్వారా తమ శాఖలలో ఒకదానిలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి, రిపోర్ట్ చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు బ్యాంకుపై ఈ పెనాల్టీ విధించబడింది.


Click it and Unblock the Notifications