భారతదేశంలో అప్పు తీసుకోవడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. నిమిషాల్లో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఈ సులభమైన అప్పులే ఇప్పుడు బ్యాంకింగ్ రంగానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఎటువంటి గ్యారెంటీ లేని పర్సనల్ లోన్ (personal loan), క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించడంలో భారతీయులు వెనుకబడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన తాజా నివేదికలో హెచ్చరించింది. దీనికి సంబంధించిన షాకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టి తీసుకునే లోన్ల కంటే, ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే పర్సనల్ లోన్ (personal loan), క్రెడిట్ కార్డ్ రుణాలు ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యధిక డిఫాల్ట్ రేటును కలిగి ఉన్నాయి. RBI విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం.. మొత్తం రిటైల్ లోన్ డిఫాల్ట్‌లలో 53.1% కేవలం ఈ అన్‌సెక్యూర్డ్ లోన్లే కావడం గమనార్హం.
ప్రైవేట్ బ్యాంకులపై తీవ్ర ప్రభావం
ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులే ఈ రిస్క్‌ను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో జరిగే మొత్తం లోన్ డిఫాల్ట్‌లలో 76% కేవలం హామీ లేని రుణాలే ఉన్నాయి. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది కేవలం 15.9% మాత్రమే. దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు ఎటువంటి కఠినమైన నిబంధనలు లేకుండా లోన్లు ఇవ్వడమే.
యువత, ఫిన్‌టెక్ యాప్‌ల పాత్ర
ఈ రోజుల్లో 35 ఏళ్ల లోపు యువత విలాసాల కోసం లేదా అత్యవసరాల కోసం సులభంగా దొరికే పర్సనల్ లోన్ (personal loan) వైపు మొగ్గు చూపుతున్నారు. ఫిన్‌టెక్ కంపెనీలు ఇచ్చే అప్పుల్లో 70% కంటే ఎక్కువ అన్‌సెక్యూర్డ్ లోన్లే ఉంటున్నాయి. నివేదిక ప్రకారం 25 ఏళ్ల లోపు యువత అప్పులు కట్టడంలో ఎక్కువగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా టైర్-2 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.
క్రెడిట్ కార్డ్, చిన్న లోన్ల కష్టాలు
డిసెంబర్ నాటికి క్రెడిట్ కార్డ్ మొండి బకాయిలు (NPAs) రూ. 6,742 కోట్లకు చేరాయి. మరోవైపు, రూ. 10,000 కంటే తక్కువ విలువ కలిగిన చిన్న పర్సనల్ లోన్లలో డిఫాల్ట్ రేటు అత్యధికంగా ఉంది. ఉద్యోగ నష్టం లేదా మితిమీరిన ఖర్చులు ప్రజలను ఈ అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల నుండి లోన్లు తీసుకున్న వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది.
నిపుణుల సూచనలు
ఒక పర్సనల్ లోన్ (personal loan) తీసుకునే ముందు మీ ఆదాయం , తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ వడ్డీకి వస్తోంది కదా అని అవసరం లేకపోయినా అప్పు చేయడం వల్ల మీ సిబిల్ (CIBIL) స్కోర్ దెబ్బతింటుంది. భవిష్యత్తులో మీకు ఇల్లు లేదా కారు కొనడానికి లోన్ కావాలన్నప్పుడు ఈ చిన్న పొరపాట్లు అడ్డంకిగా మారతాయి.
ప్రస్తుతం బ్యాంకులు తమ లెండింగ్ రూల్స్‌ను కఠినతరం చేస్తున్నాయి. ముఖ్యంగా పర్సనల్ లోన్ల విషయంలో రిస్క్ పెరగకుండా ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఒక్కటే ఈ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications