RBI News: గడచిన ఏడాది నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వ్యాపారంలోని అనేక సంస్థలు, బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ కఠిన వైథరిని అవలంభిస్తోంది.
ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై కఠిన చర్యల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంకు యాక్షన్ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆర్బీఐ మూడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ క్రమంలో NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. ఈ మూడు NBFCలు భరతు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ ఇండియా, కాక్స్ & కింగ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, PSPR ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ప్రభావం పడింది.

ఇప్పటికే తొమ్మిది ఎన్‌బిఎఫ్‌సిలు, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ లైసెన్స్‌లను సరెండర్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక నోటిఫికేషన్‌లో తెలిపింది. హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపారం నుంచి నిష్క్రమించిన తర్వాత రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా తన లైసెన్స్‌ను సరెండర్ చేసింది.
తొమ్మిది ఎన్‌బిఎఫ్‌సిలలో.. స్మైల్ మైక్రోఫైనాన్స్, జెఎఫ్‌సి ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, కావేరీ ట్రేడెఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ గిన్ని ట్రాడెఫిన్ లిమిటెడ్ వ్యాపారం నుంచి బయటకు వెళ్లిన తర్వాత తమ లైసెన్స్‌లను సరెండర్ చేశాయి. అదేవిధంగా JG ట్రేడింగ్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, SK ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్, మైక్రోఫర్మ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, బోహ్రా & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మహికో గ్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ లైసెన్స్‌లను సరెండర్ చేశాయి.
దీనికి ముందు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఎన్‌బిఎఫ్‌సిలు బ్యాంక్ లైసెన్స్ అడగడం అసహజమన్నారు. ఎన్‌బిఎఫ్‌సిలు ఇప్పటికే కొన్ని రెగ్యులేటరీ ప్రయోజనాలను పొందుతున్నాయని రావు చెప్పారు. వడ్డీ రేట్లపై రెగ్యులేటర్ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి, అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నందుకు తాజా చర్యలు వచ్చాయి. వ్యాపార కార్యకలాపాలు కొన్ని లైసెన్సింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేనందున చర్యలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎక్కువ సంఖ్యలో ఎన్‌బీఎఫ్‌సీలు డిపాజిట్లను స్వీకరించేందుకు ఆర్‌బీఐ అనుకూలంగా లేదని ఆయన అన్నారు. కొత్తగా ఒక్క లైసెన్స్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications