RBI News: ఇక బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్స్ ఈజీగా కుదరవ్..! ఆర్‌బీఐ న్యూ రూల్స్ ఇవే..
Banking News: దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో ఉంచేందుకు రిజర్వు బ్యాంక్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా బడ్జెట్ తర్వాత కొత్త కఠిన నిబంధనను తీసుకొచ్చింది.
ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఇకపై మోసగాళ్లు మనీ లాండరింగ్ కోసం నగదు బదిలీకి బ్యాంకింగ్ మార్గాన్ని ఉపయోగించటం కుదరదు. ఆర్బీఐ నగదు బదిలీ నిబంధనలను(Money Deposit Rules) కఠినతరం చేస్తూ ఇకపై బ్యాంకులు ఏదైనా లావాదేవీ చేసినప్పుడు చెల్లింపుదారులతో పాటు లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి కేవైసీ వివరాలను తప్పక రికార్డు చేయాల్సిందేనని దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. దీనికి ముందు ఉన్న నగదు బదిలీ రూల్స్ ప్రకారం ఎవరైనా వ్యక్తి తనకు బ్యాంక్ ఖాతా లేని వాక్-ఇన్ కస్టమర్ సదరు బ్యాంకులో రూ.5,000 వరకు లావాదేవీ చేసేందుకు అనుమతించేవి. గరిష్ఠంగా వారికి నెలకు రూ.25,000 లోపు నిధులను బదిలీ చేసేందుకు వీలు కల్పించేవి. వీటిని కొందరు అక్రమాలకు పాల్పడేందుకు వినియోగిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించటంతో తాజా చర్యలు వచ్చాయి.

అయితే కొత్త నిబంధనల ప్రకారం చెల్లింపు చేసే బ్యాంకులు, వ్యాపార కరస్పాండెంట్‌లు తప్పనిసరిగా ధృవీకరించబడిన సెల్ ఫోన్ నంబర్, అప్‌డేట్ చేయబడిన KYC వివరాలను ఆధారంగా చెల్లింపుదారుల నుంచి నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఇందులో అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రం (OVD) మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ధేశించింది. అంటే ఇకపై కొత్త నియమాలు ప్రతి లావాదేవీకి అదనపు కారకాల ప్రమాణీకరణను పరిచయం చేస్తాయి. వాస్తవానికి ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు, వ్యాపార కరస్పాండెట్లను ఈ వివరాలను రిజర్వు బ్యాంక్ కోరింది.
ఇక ఆన్‌లైన్ బ్యాంకింగ్ చెల్లింపుల విషయానికి వస్తే.. IMPS/NEFT లావాదేవీ సందేశంలో భాగంగా చెల్లింపుదారు వివరాలను చేర్చి, లావాదేవీని నగదు ఆధారిత చెల్లింపుగా గుర్తించబడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త రూల్స్ నంబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఈ చర్యలు దేశంలో ఆన్‌లైన్ మోసాల ద్వారా డబ్బును బదలాయింపులను నిరోధించటంలో భాగంగా తీసుకున్న చర్యగా ఆర్బీఐ చెబుతోంది. మోసగాళ్లు థర్డ్-పార్టీ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం ద్వారా కస్టమర్‌లను మోసం చేస్తారు. ఆ తర్వాత డబ్బు దీనితో సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాక వారికి కొంత కమిషన్ చెల్లించి నగదు రూపంలో విత్‌డ్రా చేస్తుంటారు.
దీనివల్ల సాధారణ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే..?
రిజర్వు బ్యాంక్ తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం గతంలో మాదిరిగా ప్రజలు బ్యాంకుకు వెళ్లి తమ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇంకెవరి ఖాతాల్లో అయినా డబ్బు జమ చేయటం కుదరదు. ఎందుకంటే అది వారి ఖాతా కానందున తమ కేవైసీ వివరాలు బ్యాంకుకు(Cash Deposit KYC) అందిస్తేనే క్యాష్ జమ చేయటం అనుమతించబడుతుంది. అంటే ఇతరుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు వేయటానికి తప్పనిసరిగా వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. అలాగే డబ్బు డిపాజిట్ చేస్తున్న వ్యక్తి వివరాలను సైతం బ్యాంక్ అధికారులు ఇకపై స్టోర్ చేస్తారు.


Click it and Unblock the Notifications