Indusind Bank: మార్చి 15న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ఇండ్ బ్యాంక్ చుట్టూ కొనసాగుతున్న అనేక ఊహాగానాలపై స్పష్టతను ఇచ్చింది. గతవారం బ్యాంక్ గుర్తించిన కొన్ని డెరివేటివ్ ట్రేడింగ్ నష్టాల గురించి ఇన్వెస్టర్లలో కలిగిన ఆందోళనల కారణంగా బ్యాంక్ షేర్లు భారీగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్కటే రోజున 28 శాతం మేర స్టాక్ పతనమైన సంగతి తెలిసిందే. దీనిపై యజమాని అయిన హిందుజా గ్రూప్ అధికారిక ప్రకటన విడుదల చేసినప్పటికీ తాజాగా రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది.
డిసెంబర్ 31, 2024తో ముగిసిన త్రైమాసికానికి ఇండస్ఇండ్ బ్యాంక్ 16.46% మూలధన సమృద్ధి నిష్పత్తి, 70.20% ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తిని నివేదించింది. అలాగే మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి 113 శాతంగా ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ గమనించింది. వాస్తవానికి ఇది నిబంధనల ప్రకారం ఉండాల్సిన 100 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అందువల్ల బ్యాంకులో డిపాజిట్లను కలిగి ఉన్న ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుత త్రైమాసికంలో (Q4FY25) పరిష్కార చర్యను పూర్తిగా పూర్తి చేయాలని RBI బోర్డు, బ్యాంకు నిర్వహణను ఆదేశించింది. ఇటీవలి వ్యత్యాసాల ప్రభావాన్ని అంచనా వేయడానికి బాహ్య ఆడిట్ జరుగుతోందని కూడా ఇది పేర్కొంది.
ఇండస్ఇండ్ బ్యాంక్ ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉందని, నియంత్రణ పర్యవేక్షణలో ఉందని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అలాగే బ్యాంకు పనితీరు, స్టెబిలిటీపై వస్తున్న అనేక ఊహాజనిత నివేదికలకు ప్రతిస్పందించవద్దని RBI కస్టమర్లను కోరింది. వాస్తవానికి వారం కిందట ఇండస్ఇండ్ బ్యాంక్ తన డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో వ్యత్యాసాలు దాని నికర విలువను సుమారు 2.35% తగ్గించవచ్చని రూ.1,600 కోట్ల మేర ఇది ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని బ్యాంక్ పేర్కొంది. అయితే ఇవి దాదాపు 7-8 ఏళ్ల కిందటి లావాదేవీలుగా పేర్కొంటూ వాటిని ముందుగా బ్యాంక్ గుర్తించినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులతో పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ చైర్మన్ అశోక్ హిందూజా అన్నారు. ఇలాంటి సంక్షోభాలు సహజమేనని పెట్టుబడిదారులు ఓపికగా ఉండాలని ఆయన సూచించారు. గత మూడు త్రైమాసికాల్లో కంపెనీ రూ.11 వేల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించిందని ఇలాంటి పరిస్థితుల్లో రూ.1600 కోట్ల నష్టాన్ని భరించటం పెద్ద విషయం కాదని ఇన్వెస్టర్లకు చెప్పారు. ఈ సమస్యలను యాజమాన్యం గుర్తించిందని, ఆడిటర్లు కాదని తమ పారదర్శకత, నిబద్ధతను మార్కెట్లు అభినందించాలని కోరారు.
ఈ వ్యవహారంపై దేశంలో 5వ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ రెగ్యులేటరీకి మార్చి 10, 2025న సమాచారం అందించింది. అయితే ప్రస్తుతం బ్యాంక్ పూర్తి ఆరోగ్యంగా ఉందని, ట్రేడ్ వల్ల కలిగే నష్టాలను గ్రహించటానికి లాభాలు, క్యాపిటల్ రిజర్వ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.అయితే ఈ ట్రేడ్స్ గత ఆర్థిక సంవత్సరానికి 5-7 ఏళ్ల పూర్వకాలానికి చెందినవిగా తెలుస్తోంది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీ మరో యెస్ బ్యాంక్ లాంటి పతనానికి దారితీస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒకప్పుడు యాజమాన్యం చేసిన తప్పుల కారణంగా యెస్ బ్యాంక్ ఎలా కుప్పకూలిందో మనందరికీ తెలిసిందే.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications