IIFL News: రిజర్వు బ్యాంక్ ఇటీవల దేశంలోని బ్యాంకింగ్, ఇతర ఫైనాన్షియల్ సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్బీఐ ఆగ్రహానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ ఐఐఎఫ్ఎల్ బలైంది.
మార్చి 4న IIFL ఫైనాన్స్‌ని కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని మెటీరియల్ సూపర్‌వైజరీ సమస్యలను గమనించిన తర్వాత గోల్డ్ లోన్‌ల మంజూరును తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934లోని సెక్షన్ 45L(1)(b) కింద తన అధికారాలను అమలు చేస్తూ.. IIFL ఫైనాన్స్ లిమిటెడ్‌ని వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది.

రిజర్వు బ్యాంక్ లేవనెత్తిన అంశాలను వీలైనంత త్వరగా పాటించటంతో గోల్డ్ లోన్ పోర్ట్ ఫోలియో వ్యాపారాన్ని తిరిగి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ఐఐఎఫ్ఎల్ ప్రకటించింది. సమస్యలను వేగవంతంగా సరిదిద్దడానికి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని మెటీరియల్ సూపర్‌వైజరీ ఆందోళనలు గమనించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వీటిని సరిదిద్దేందుకు కంపెనీ బలమైన ప్రయత్నాలు చేయలేదని పేర్కొంది.
వాస్తవానికి లోన్ ఇస్తున్న సమయంలో, వేలం వేస్తున్న సమయంలో బంగారం స్వచ్ఛతను పరిశీలించటం, లోన్ టూ వ్యాల్యూ రేషియో విషయంతో పాటుగా లోన్ సొమ్మును పరిమితికి మించి డబ్బు రూపంలో వసూలు చేయటంపై రిజర్వు బ్యాంక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కస్టమర్ల ఖాతాలపై విధిస్తున్న ఛార్జీల్లో పారదర్శకత లేకపోవటం, వేలం ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవటాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మెుత్తంగా రూ.24,692 కోట్ల గోల్జ్ లోన్ పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. దేశంలోని 25 రాష్ట్రాల్లో 2,751 పట్టణాల్లో కంపెనీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
అయితే రిజర్వు బ్యాంక్ కఠిన చర్యలు కంపెనీ పెట్టుబడిదారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. దీంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐఐఎఫ్ఎల్ కంపెనీ షేర్ ఏకంగా ఇంట్రాడేలో 20 శాతం క్షీణతను నమోదు చేసింది. ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఉదయం 10 గంటల సమయంలో రూ.477.75గా కొనసాగుతోంది. కంపెనీ తర్వాతి చర్యలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో ఇటీవల రిజర్వు బ్యాంక్ తీరు చూసిన తర్వాత పెట్టుబడిదారులు భయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications