రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇతర బ్యాంకులకు అప్పుగా ఇచ్చే వడ్డీ రేటును రెపో రేటు అంటారనే విషయం అందరికీ తెలిసిందే. RBI ఇటీవల ఈ రెపో రేటును 6% నుండి 5.5 శాతానికి తగ్గించింది. ఇది రుణాల వడ్డీ రేట్లను తగ్గించి.. ప్రజలకు ఆర్థిక ఊరట ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. అయితే ఇది ప్రతి రుణగ్రహీతకు నేరుగా లాభం చేకూర్చదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు లక్షల రూపాయలు చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు.
బిజినెస్ టుడే కథనం ప్రకారం చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ మాట్లాడుతూ..Repo Rate తగ్గింపు ఉన్నప్పటికీ చాలా మంది రుణగ్రహీతలు వారి సమానమైన నెలవారీ వాయిదాలలో (EMIలు) తక్షణ తగ్గింపును చూడకపోవచ్చని చెబుతున్నారు. రెపో రేటు తగ్గితే మీ EMI తక్షణమే తగ్గుతుంది అని భావించడం తప్పు. ఇది కేవలం రెపో లింక్ అయిన రుణాలకే వర్తిస్తుంది.

అంటే మీ రుణం రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) లేదా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) ఆధారంగా ఉండాలి. పాత విధానమైన MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) లేదా ఫిక్స్‌డ్ రేటు మీద ఉంటే మీరు వడ్డీ తగ్గింపును పొందకపోవచ్చని చెబుతున్నారు. దీనిపై రుణగ్రహితలు త్వరితంగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని.. లేకుంటే వారి రుణ కాలంలో లక్షల రూపాయలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వడ్డీ తగ్గినప్పటికీ బ్యాంకులు స్వయంగా మీ EMIని తగ్గించవు. మీరు 90 రోజుల లోపు బ్యాంకును సంప్రదించి రేటు తగ్గింపు అవకాశం ఉపయోగించుకోవాలి. లేకపోతే వడ్డీ రేటు తగ్గినప్పటికీ, మీరు పాత EMI కొనసాగిస్తూ లక్షల రూపాయలు అధికంగా చెల్లించవలసి వస్తుంది. ముందుగా మీరు తీసుకున్న రుణం ఎలాంటి రేటుకు అనుసంధానించబడి ఉంటుందో తెలుసుకోండి. ఇది పాత వ్యవస్థ అయితే, మీరు RLLRకి మారేందుకు బ్యాంకును అభ్యర్థించవచ్చు. ఇందుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఫీజు ఉండొచ్చు కానీ దీని ప్రయోజనాలు చాలా ఎక్కువ కాలానికి ఉంటాయి.
మీరు ఈ 90 రోజుల వ్యవధిని కోల్పోతే.. రాబోయే సంవత్సరాల్లో మీరు అధిక EMIలు చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకుల నుండి సమాచారం లేకపోవడం వల్ల ఎక్కువ చెల్లించకుండా ఉండటానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని కౌశిక్ ప్రజలకు సలహా ఇస్తున్నారు. మీ బ్యాంకు మీ అభ్యర్థనపై స్పందించకపోతే, మీరు RBI యొక్క 2019 సర్క్యులర్ (2024లో సవరణతో) ప్రకారం.. రేటు రీసెట్ అభ్యర్థనను మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇంకా స్పందంచికపోతే RBI ఫిర్యాదు వ్యవస్థ ద్వారా చర్యలు తీసుకోవచ్చు.
వడ్డీ రేటు తగ్గింపుల నేపథ్యంలో రుణగ్రహీతలు చాలా జాగ్రత్తగా ఉండాలని కౌశిక్ చెబుతున్నారు. మీ బ్యాంక్ మీకు చెప్పడం మర్చిపోయిందని చెప్పి మీరు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా చర్య తీసుకోవడం ద్వారా రుణగ్రహీతలు రెపో రేటు తగ్గింపును సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు.
వారి రుణ కాలపరిమితిలో గణనీయమైన పొదుపు చేయవచ్చు. ఏదేమైనా రెపో రేటు తగ్గింపును ఉపయోగించుకోవాలంటే జాగ్రత్త అవసరం. బ్యాంకుల ఆధీనంలో వదిలేయకండి. మీ రుణ వివరాలను పరిశీలించి, సకాలంలో చర్య తీసుకుంటే EMIపై లక్షల రూపాయలు పొదుపు చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications