ముంబై: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఆయన భార్య రేఖ గత 11 సెషన్‌లలో రోజుకు రూ.18.40 కోట్ల చొప్పున ఆర్జించారు. వీరు ఎన్‌సీసీ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 2020తో ముగిసే త్రైమాసికానికి వీరికి ఈ కంపెనీలో రూ.7.83 కోట్ల షేర్లు ఉన్నాయి. ఎన్సీసీ నెట్ షేర్లలో ఇద్దరి వద్ద కలిసి 12.84 శాతం ఉన్నాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దేశీయ ప్రముఖ ఇన్వెస్టర్‌గా నిలిచారు. ఆయన పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో రిటర్న్స్ పొందుతున్నారు.

రూ.202 కోట్లు పెరిగిన సంపద
జనవరి 29వ తేదీన ఎన్సీసీ స్టాక్ రూ.58.95 వద్ద క్లోజ్ అయింది. ఆ రోజుకు రాకేష్ వాటా రూ.461.77 కోట్లుగా ఉంది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నాటికి 43.85 శాతం లాభపడింది. షేర్ నిన్న రూ.84.80 వద్ద క్లోజ్ అయింది. అప్పుడు రాకేష్ ఝున్‌ఝున్ దంపతుల వాటా రూ.664.26 కోట్లకు చేరుకుంది. అంటే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, రేఖల ఆదాయం ఈ 11 సెషన్లలో రూ.202.49 కోట్లు పెరిగింది.

ర్యాలీ
ఇతర సంస్థలతో పోలిస్తే ఎన్సీసీ ఇటీవలి కాలంలో ర్యాలీ చేసింది. ఇతర సంస్థలు 7 శాతం, 32 శాతం చొప్పున ర్యాలీ చేయగా, ఎన్సీసీ లిమిటెడ్ 44 శాతం వరకు ర్యాలీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఎన్సీసీ లిమిటెడ్ మొత్తం ఆదాయం రూ.1,942.85 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ.2,149.03 కోట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన ఆదాయం స్వల్పంగా తగ్గింది.

సెన్సెక్స్ జూమ్
జనవరి 29వ తేదీ నుండి నిన్నటి వరకు సెన్సెక్స్ దాదాపు 5,900 పాయింట్లు, నిఫ్టీ 1680 పాయింట్ల వరకు ఎగిసింది. జనవరి 29న సెన్సెక్స్ 46,285 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 13,634 పాయింట్ల వద్ద ఉంది. బడ్జెట్‌కు ముందు సూచీలు వరుసగా ఆరు సెషన్లలో నష్టపోయాయి. అయితే బడ్జెట్ నుండి లాభపడ్డాయి. బడ్జెట్‌కు ముందు 46,300 దిగువన ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 52,000 పాయింట్ల పైన ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications