ప్రముఖ బ్రోకరేజీ సంస్థ యస్ సెక్యూరిటీస్... వీఏ టెక్ వాబాగ్ సంస్థ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. ఈ హోమ్ గ్రోన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లేయర్ స్టాక్ మున్ముందు మరింత పెరగవచ్చునని అంచనా వేస్తోంది. ఈ స్టాక్‌లో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖ ఝున్‌ఝున్‌వాలాకు షేర్లు ఉన్నాయి. వీఏ టెక్ వాబాగ్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్‌కు సంబంధించి మల్టీ నేషనల్ కంపెనీ. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.309 వద్ద ఉంది. ఈ రోజు రూ.5.15 లేదా 1.69 శాతం లాభపడి రూ.309.50 వద్ద ముగిసింది.
వీఏ టెక్ వాబాగ్ లిమిటెడ్ 2022 క్యాలెండర్ ఏడాదిలో దాదాపు 1 శాతం క్షీణించింది. అయితే సంవత్సర కాలంలో 28 శాతం, నెలలో 8 శాతం లాభపడింది. నేడు 5 శాతానికి పైగా ఎగిసింది.

ఇదిలా ఉండగా, నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో మన మార్కెట్లు నష్టపోయాయి. అలాగే, కంపెనీల ఫలితాలకు ముందు ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హిందూస్తాన్ యూనీలీవర్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్లు ఏ దశలోను కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 482 పాయింట్లు నష్టపోయి 58,964 పాయింట్ల వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు క్షీణించి 17,674 పాయింట్ల వద్ద ముగిసింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications