స్టాక్ మార్కెట్లు నిన్న భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ నిన్న ఏకంగా 1200 పాయింట్ల వరకు నష్టపోయి, నేడు దాదాపు 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిన్న మార్కెట్లు కుప్పకూలిన సమయంలో కేవలం పది నిమిషాల్లోనే ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భారీగా నష్టపోయారు. పది నిమిషాల్లోనే రూ.230 కోట్లు నష్టపోయారు. అయితే నేడు ఆయన భారీగా లాభపడ్డారు. నిన్నటి నష్టం నేడు పూడ్చుకున్నట్లుగా అయింది.

టైటాన్ స్టాక్ ద్వారా పోయి వచ్చింది
రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు టైటాన్ కంపెనీ షేర్లు ఉన్నాయి. శుక్రవారం ఈ స్టాక్ రూ.2280 వద్ద ముగియగా, నిన్న రూ.2240 సమీపంలో నిలిచింది. గత శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే రూ.40 వరకు తగ్గింది. మార్కెట్ ప్రారంభం నుండి నిన్న టైటాన్ నష్టాల్లోనే ఉంది. దీంతో రాకేష్ ఈ స్టాక్ ద్వారా రూ.170 కోట్ల వరకు నష్టపోయారు. అయితే నేడు ఈ స్టాక్ 2.28 శాతం లాభపడింది. శుక్రవారం ముగింపు రూ.2280 కంటే నేడు పైకి చేరుకుంది. నేడు రూ.2290 వద్ద ముగిసింది. దీంతో ఈ స్టాక్ ద్వారా ఆయన నిన్న కోల్పోయిన నష్టం కంటే ఎక్కువగా ఆర్జించారు.

ఈ స్టాక్‌తో రూ.60 కోట్ల నష్టం
టాటా మోటార్స్ షేర్ ఘత శుక్రవారం రూ.470 వద్ద ముగిసింది. అయితే నిన్న రూ.447 వద్ద ముగిసింది. టాటా మోటార్స్ షేర్ నిన్న రూ.454 పడిపోయినప్పుడే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రూ.60 కోట్ల మేర నష్టపోయారు. ఆ తర్వాత మరింత క్షీణించడంతో ఈ స్టాక్స్‌లో ఆయన అంతకంటే ఎక్కువగా కోల్పోయారు. నేడు ఈ స్టాక్ కాస్త లాభపడినప్పటికీ, గత శుక్రవారంతో పోలిస్తే రూ.17 తక్కువగానే ఉంది. శుక్రవారంతో పోలిస్తే ఈ రోజుకు కూడా టాటా మోటార్స్‌లో రాకేష్ రూ.60 కోట్లకు పైగా నష్టపోయారు.

అప్పుడే అతనికి లాభాలు
అయితే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌పోలియోలో టైటాన్ స్టాక్ రూ.2150, రూ.2300 మధ్య ఉంది. కాబట్టి టైటాన్ స్టాక్ రూ.2300 బ్రేక్ చేస్తే కానీ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు రిటర్న్స్ వచ్చినట్లుగా భావించవచ్చునని అంటున్నారు. అలాగే టాటా మోటార్స్ స్టాక్స్ రూ.430 నుండి రూ.460 స్థాయికి వెళితే గానీ ఆయనకు రిటర్న్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ స్టాక్‌లో రూ.220 ఇన్వెస్ట్ చేస్తే, రూ.440కి
రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్‌లోను పెద్ద ఎత్తున షేర్లు ఉన్నాయి. ఇది నిన్నటి వరకు వరుసగా ఐదు సెషన్లు నష్టపోయింది. ఈ ఐదు సెషన్లలో 17 శాతం క్షీణించింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.218 వద్ద ఉంది. ఈ స్టాక్‌ను రూ.200 సమీపంలో కొనుగోలు చేస్తే, స్వల్పకాలంలో రూ.240ను టార్గెట్‌గా పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. ఈ స్టాక్ రూ.260ని క్రాస్ చేస్తే మరింత పైకి చేరుకోవచ్చునని అంటున్నారు. అదే సమయంలో ఈ స్టాక్ లాంగ్ టర్మ్‌లో మూడేళ్లలో రూ.440 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications