ఆ బ్యాంకులో Sovereign Gold Bond కొన్న ఇన్వెస్టర్లకు నోటీసులు.. 5 రోజులే గడువు, పూర్తి వివరాలు..
Punjab National Bank: భారతీయులు పసిడి ప్రియులు. అందువల్ల ఇక్కడ భౌతిక బంగారానికి డిమాండ్ ఎల్లప్పుడూ అధికంగానే కొనసాగుతూ ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే పెట్టుబడిదారులకు డిజిటల్ రూపంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చింది. గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు వంటి నిర్దిష్ట పన్ను ప్రయోజనాలతో పాటు వడ్డీ రాబడిని సైతం ఇది అందిస్తోంది.
అయితే తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. తమవద్ద సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల వడ్డీ ఆదాయాన్ని ఇప్పటికీ అందుకోకపోతే సంబంధిత బ్యాంక్ బ్రాంచీలను సందర్శించాలని సూచించింది. అలాగే త్వరలో బాండ్ మెచ్యూర్ అవుతున్నా లేక ఇప్పటికే మెచ్యూర్ అయిన కస్టమర్లను ఉద్ధేశించి ఈ సూచన చేసింది. గోల్డ్ బాండ్లపై సజావుగా వడ్డీని పొందటానికి ఖాతాదారులు 5 రోజుల్లోగా తమ బ్యాంక్ ఖాతాలను ధృవీకరించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది.

తప్పుడు ఖాతా నంబరు లేదా క్లోజ్డ్ అకౌంట్లు, 6 ఏళ్లకు పైగా కాలం నుంచి వడ్డీ క్లెయిమ్ చేయని సందర్భంలో బ్యాంక్ బాధ్యత వహించని రిజర్వు బ్యాంక్ ఆదేశాలను తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. రిడెమ్షన్ పూర్తయ్యే వరకు తమ బ్యాంక్ ఖాతాలను మూసివేయవద్దని బ్యాంక్ పెట్టుబడిదారులను అభ్యర్థించింది. ఒక వేళ ఏదైనా కారణాల వల్ల ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయవలసి వస్తే ప్రత్యామ్నాయ ఖాతా వివరాలను పెట్టుబడిదారులు అందించాలని సూచించింది.
రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం గడువు తేదీ నుంచి 30 రోజుల్లోపు వడ్డీ లేదా రిడెంప్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే, లిస్టెడ్ ఎంటిటీ తప్పనిసరిగా 30-రోజుల మార్క్ తర్వాత 7 రోజులలోపు నిధులను ఎస్క్రో ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. 7 ఏళ్ల తర్వాత మిగిలి ఉన్న ఏదైనా క్లెయిమ్ చేయని మొత్తం వడ్డీతో పాటు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(IPEF)కి బదిలీ చేయబడుతుంది. IPEFకి కేటాయించబడిన అన్‌క్లెయిమ్ చేయని నిధులు, ఫండ్‌కు క్లెయిమ్ సమర్పించిన అర్హులైన, గుర్తించదగిన పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించబడతాయి.


Click it and Unblock the Notifications