PNB FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సూపర్ రేటు.. వారికి మాత్రం అత్యధికంగా వడ్డీ చెల్లింపు..
PNB FD Rate Hike: రిజర్వు బ్యాంక్ గత నెలలో వడ్డీ రేట్లను సవరించటంతో ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. నిజంగా ఇన్వెస్టర్లకు ఇది స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం తన వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన వడ్డీ రేట్లు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లాభదాయకమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. బ్యాంక్ తాజాగా రూ.2 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా..
PNB సీనియర్ సిటిజన్‌ల FD వడ్డీ రేటును 6.15 శాతం నుంచి 6.45 శాతానికి పెంచింది. 5-10 సంవత్సరాల పదవీకాలం కోసం ఈ రేట్లు అందుబాటులో ఉన్నాయి. 60-80 ఏళ్ల వయస్సులోపు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లు 5 ఏళ్ల వరకు చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు వడ్డీ అదనంగా పొందుతారని బ్యాంక్ వెల్లడించింది. అదే విదంగా 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలానికి చేసే డిపాజిట్లపై ఏకంగా 80 బేసిస్ పాయింట్లు అదనంగా పొందుతారని తెలిపింది. ఇవి రూ.2 కోట్ల లోపు పెట్టుబడులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్ సిబ్బందికి ప్రయోజనాలు..
సీనియర్ సిటిజన్‌లు అయిన బ్యాంక్ సిబ్బందితో పాటు రిటైర్డ్ సిబ్బంది విషయంలో బ్యాంక్ మరింత ఎక్కువ వడ్డీని చెల్లిస్తోంది. 5 ఏళ్ల లోపు ఉండే డిపాజిట్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్డ్ రేటు కంటే గరిష్ఠంగా 150 బేసిస్ పాయింట్లు.. అదే విధంగా 5 సంవత్సరాలకు పైబడిన పెట్టుబడుల విషయంలో కార్డ్ రేటు కంటే 180 బేసిస్ పాయింట్ల వడ్డీ చెల్లించబడుతుందని బ్యాంక్ వెల్లడించింది.

టాక్స్ సేవింగ్ స్కీమ్ కింద..
PNB ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ విషయంలో.. స్టాఫ్ మెంబర్స్ అలాగే రిటైర్డ్ స్టాఫ్ సభ్యులు కూడా సీనియర్ సిటిజన్‌లు, వర్తించే కార్డ్ రేటుపై గరిష్ఠంగా వడ్డీ రేటు 100 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుందని బ్యాంక్ తెలిపింది.


Click it and Unblock the Notifications