Banking Alert: కస్టమర్ల సేఫ్టీ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకులు అనేక భద్రతా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం డిసెంబర్ 12, 2022 డెడ్ లైన్ గా బ్యాంక్ నిర్ణయించింది. ఇది సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న కస్టమర్లకు ముఖ్యమైన అంశం.

నాలుగు రోజులే గడువు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) కస్టమర్లు మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాల్సిన విషయం ఒకటి ఉంది. బ్యాంక్ లో ఖాతా కలిగి ఇప్పటివరకు KYC అప్‌డేట్ చేయని PNB కస్టమర్‌లు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయని ఖాతాదారులు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఖాతాదారులు ఈ ప్రక్రియను సకాలంలో అప్‌డేట్ చేయాలని బ్యాంక్ విజ్ఞప్తి చేసింది.

కస్టమర్లకు నోటీసులు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారుల చిరునామాలకు దీనికి సంబంధించి ఇప్పటిరే రెండు సార్లు నోటీసులు పంపింది. కేవైసీ నవీకరణ వివరాలను వారి రిజిస్టర్డ్ మెుబైల్ నంబర్లకు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఇదే క్రమంలో బ్యాంక్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. నవంబర్ 20,21 తారీఖుల్లో వార్తా పత్రికల్లో ప్రకటన కూడా చేసింది. అయితే ఎలాంటి కారణాల వల్లైనా మీరు కేవైసీ ప్రక్రియను పూర్తిచేయకుండే ఈ నెల 12లోపు దానిని కంప్లీట్ చేయాలని లేకుంటే సదరు అకౌంట్ల నుంచి లావాదేవీలు నిలిపివేయబడతాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

KYC ఎందుకు అవసరమో తెలుసా..?
KYC అంటే 'నో యువర్ కస్టమర్' అని అర్థం. దీని ద్వారా బ్యాంకులు తమ వివిధ శాఖల్లో అకౌంట్లు కలిగి ఉన్న కస్టమర్ల సమాచారాన్ని కాలానుగుణంగా అప్ డేట్ చేసుకుంటాయి. తద్వారా బ్యాంక్ దగ్గర ఉన్న వివరాలు సరిగా ఉన్నాయా లేక ఏవైనా మార్పులు ఉన్నాయా అనేది గమనించటం జరుగుతుంది. బ్యాంకింగ్‌లో కస్టమర్లు ప్రతి 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి KYC ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. ఇందులో ఖాతాదారుని పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, పూర్తి చిరునామాను అందించాలి. ఇలా చేయటం వల్ల బ్యాంక్ వద్ద తన కస్టమర్ల తాజా సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇది వారి ఖాతా భద్రతను పెంచేందుకు కూడా దోహదపడుతుంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications