Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు..

ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించాయి. సవరించిన వడ్డీ రేట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కెనరా బ్యాంకులో సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ సవరణల తర్వాత, కెనరా బ్యాంక్ సాధారణ ప్రజలకు గరిష్టంగా 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సాధారణ ప్రజలకు గరిష్టంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అంతకుముందు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన FD వడ్డీ రేట్లను సవరించింది.

కెనరా బ్యాంక్ నవంబర్ 2 నుంచి కొన్ని నిర్దిష్ట కాలపరిమితి కలిగిన FDలపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల (bps) వరకు పెంచింది. కెనరా బ్యాంక్ తన '555 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం'పై అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ కాలపరిమితికి సంబంధించి సాధారణ ప్రజలకు వడ్డీ రేటును 6.60% నుంచి 6.75%కి పెంచింది. అదే FD పథకంపై సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు 7.25% వడ్డీ చెల్లిస్తోంది. అలాగే కెనరా బ్యాంక్ తన 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకంపై కూడా ఆకర్షణీయమైన రేట్లను అందిస్తోంది. ఈ పథకంలో సాధారణ ప్రజలకు 6.65 శాతం వడ్డీ లభిస్తుండగా, సీనియర్ సిటిజన్లు 7.15% వడ్డీ రేటును చెల్లిస్తోంది.

FD

కెనరా బ్యాంక్‌లో సవరించిన ఈ FD వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. కెనరా బ్యాంక్‌లో ఎఫ్డీ చేయాలనుకునే వినియోగదారులు, తమ డబ్బును ఎక్కడ డిపాజిట్ చేయాలో నిర్ణయించుకునే ముందు వివిధ కాలపరిమితులపై ఉన్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవచ్చు. కెనరా బ్యాంక్‌లో రెండేళ్ల నుండి మూడేళ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇదే వడ్డీ రేటు మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు, ఐదేళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు రేట్ల సవరణ తరువాత పీఎన్బీ డిపాజిట్ కాలపరిమితిని బట్టి సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 444 రోజుల కాలపరిమితిపై 7.10 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంపిక చేసిన కాలపరిమితులపై తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. కొత్త FD రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై వర్తిస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+