కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం చాలామంది హెల్త్ ఇన్సురెన్స్‌కు మొగ్గు చూపుతున్నారు. ఇన్సురెన్స్‌కు గతంలో లేనివిధంగా డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో ప్రయివేటు హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు కూడా బీమాను ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్, ఫ్యూచర్ జనరాలి మంచి ఆఫర్లు ఇచ్చాయి. పాలసీదారుల ఆరోగ్యం కోణంలోను ఆఫర్లు ప్రకటించాయి.

80 శాతం నుండి 100 శాతం
ఆరోగ్యవంత జీవనం గడిపే కస్టమర్లకు పాలసీల పునరుద్ధరణ (రెన్యువల్) ప్రీమియంపై 80 శాతం నుండి 100 శాతం ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రయివేటు హెల్త్ ఇన్సురెన్స్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. గిఫ్ట్స్, ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయి. సాధారణంగా హెల్త్ ఇన్సురెన్స్ సంస్థలు క్లెయిమ్ చేయని సంవత్సరాల్లో నో క్లెయిమ్ బోనస్ కింద 25 శాతం నుండి 50 శాతం ఆఫర్ ఇస్తాయి. ఇప్పుడు కొన్ని ప్రయివేటు హెల్త్ ఇన్సురెన్స్ సంస్థలు అంతకుమించి ఇస్తుండటం గమనార్హం.

ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్ స్కీం
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల సరికొత్త బీమా పథకాన్ని తీసుకు వచ్చింది. ఏడాది కాలంలో తగినన్ని రోజుల పాటు రోజూ 10వేల అడుగుల చొప్పున నడిచినా లేదా తాము సూచించిన వ్యాయామం రోజూ 30 నిమిషాల పాటు చేసినా, ఆరు నెలలకు ఓసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకున్నా, మరుసటి ఏడాది పాలసీ పునరుద్ధరణ ప్రీమియంపై 100 శాతం వరకు హెల్త్ రిటర్న్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. మెడిసిన్ కొనుగోళ్లు, రోగ నిర్థారణ పరీక్షలు, ఓపీ ఖర్చులు, ప్రత్యామ్నాయ చికిత్సలకు, భవిష్యత్తు ప్రీమియం చెల్లింపులకు వీటిని వినియోగించుకోవచ్చు.
పాలసీదారు జీవనశైలిని యాక్టివ్ హెల్త్ యాప్ ద్వారా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్ పరిశీలిస్తుంది. పాలసీదారు ఏడాదికి కొనుగోలుచేసిన ప్రీమియం మొత్తంలో 50 శాతం చొప్పున నె క్లెయిమ్ బోనస్ కింద తిరిగి వస్తుంది. అంతేకాదు, రెండేళ్ల పాటు క్లెయిమ్ చేయకుంటే బీమా పాలసీ ప్రీమియం మొత్తం వెనక్కి తిరిగి ఇస్తారు.

ఫ్యూచర్ జనరాలీ
మరో ప్రయివేటు హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ ఫ్యూచర్ జనరాలీ కూడా 80 రాయితీతో కొత్త పాలసీని ప్రారంభించింది. మొదటి, రెండు సంవత్సరాల్లో ఎలాంటి క్లెయిమ్స్ లేకుంటే ఇది వర్తిస్తుంది. దీనిని సూపర్ సేవర్ పాలసీగా చెబుతున్నారు. ఇందులో 1X, 2X పేరుతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 1Xలో క్రితం సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేయకుంటే మరుసటి రెన్యూవల్ ప్రీమియంపై 80 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 2Xలో రెండేళ్ల పాటు క్లెయిమ్స్ లేకుంటే తదుపరి రెండు సంవత్సరాల ప్రీమియంలో 80 శాతం తక్కువ ఉంటుంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications