Fixed Deposit: ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం 5 సూపర్ బ్యాంక్స్ ఇవే.. మార్కెట్ క్రాష్‌లో సేఫ్ గేమ్..
High FD Rates: భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం భారీగా ఓలటాలిటీ కొనసాగుతోంది. దీంతో చాలా మంది తమ డబ్బును ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో బంగారం ధరలు సైతం గరిష్ఠాలను తాకి తగ్గుతున్న వేళ ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడికి సరైన సమయం కాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో పార్క్ చేయాలని చూస్తున్నారు.
ఏడాది కాలానికి బ్యాంకుల వద్ద డబ్బు డిపాజిట్ చేయటం ద్వారా రక్షణతో పాటు మంచి వడ్డీ ఆదాయాన్ని ఆశిస్తున్న చాలా మందికి శుభవార్త. దేశీయంగా కొన్ని బ్యాంకులు ఏడాది కాలానికి చేస్తున్న డిపాజిట్లపై అత్యుత్తమ వడ్డీ ఆదాయాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థల కంటే ప్రైవేటు బ్యాంకులే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. ఇదే క్రమంలో సాధారణ పెట్టుబడిదారుల కంటే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచుతుంటుంది.

ఇప్పుడు దేశీయంగా అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకుల వివరాలను పరిశీలిస్తే.. ముందు వరుసలో ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ బంధన్ బ్యాంక్ నిలిచింది. ఏడాది కాలానికి సాధారణ ఇన్వెస్టర్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 8.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే క్రమంలో రెండవ స్థానంలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడాది కాలానికి చేస్తున్న టర్మ్ డిపాజిట్లపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పెట్టుబడిదారులకు సురక్షితంగా రాబడులను అందిస్తున్న మూడవ బ్యాంకుగా ఆర్బీఎల్ నిలిచింది. ప్రస్తుతం ఏడాది కాలానికి చేసే పెట్టుబడులపై బ్యాంక్ 7.5 శాతం వడ్డీని సాధారణ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తోంది.
పెట్టుబడిదారులకు భారీగా డబ్బు పెట్టుబడిపై వడ్డీ ఆదాయాన్ని అందిస్తున్న బ్యాంకుల జాబితాలో కర్ణాటక బ్యాంక్ సైతం టాప్ రేసులో కొనసాగుతోంది. ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ తన పెట్టుబడిదారలు ఏడాది కాలానికి చేసే డిపాజిట్లపై 7.35 శాతం రాబడిని ఆఫర్ చేస్తోంది. ఇక అత్యుత్తమ రాబడిని అందిస్తూ డిపాజిటర్లను ఆకర్షిస్తున్న బ్యాంకుల్లో యెస్ బ్యాంక్ ఐదవ స్థానంలో నిలిచింది. మెుత్తం మీద పెట్టుబడిదారులను ఆకర్షించటానికి ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థలు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.
పైన బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిస్తే అగ్ర స్థానంలో నిలిచిన బంధన్ బ్యాంకులో ఇన్వెస్టర్లు ఏడాది కాలానికి లక్ష రూపాయలు బ్యాంకులో ఈ రేటు వద్ద డిపాజిట్ చేసినట్లయితే వారు రూ.8296 వడ్డీ ఆదాయాన్ని పొందుతారు. అలాగే రూ.5 లక్షలు పెట్టుబడిగా పెడితే వారు వడ్డీ రూపంలో ఏడాది తర్వాత రూ.41,481 ఆదాయంగా పొందే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications