PPF లో ఎక్కువ లాభం రావాలా? ప్రతి నెల ఆ తేదీ లోపు డబ్బులు డిపాజిట్ చేయండి!

మన దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా, మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రభుత్వ పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది సురక్షితమైన పెట్టుబడి మాత్రమే కాదు, టాక్స్ సేవింగ్స్‌కి కూడా సూపర్ ఆప్షన్. అయితే, పీపీఎఫ్ అకౌంట్ ఉన్న చాలా మందికి ఒక ముఖ్యమైన విషయం తెలియదు. మనం డబ్బులు డిపాజిట్ చేసే టైమింగ్‌ని బట్టి మనకు వచ్చే వడ్డీ మారుతుంది! అవును, ప్రతి నెలలో ఒక నిర్దిష్ట తేదీ లోపు డబ్బులు జ జమ చేస్తేనే మనకు పూర్తి నెల వడ్డీ దక్కుతుంది. ఈ చిన్న స్మార్ట్ హ్యాక్ ఏంటో, దీనివల్ల లాభాలు ఎలా పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం.

PPF Income Strategy Deposit Before 5th Of Every Month To Maximise Interest Return Rules

అసలు పీపీఎఫ్ అంటే ఏంటి? వడ్డీ ఎలా లెక్కిస్తారు?

పీపీఎఫ్ అనేది 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉండే లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్. కావాలనుకుంటే దీనిని ఐదేళ్ల బ్లాక్‌ల చొప్పున ఎంత కాలమైనా పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వడ్డీని ప్రతి సంవత్సరం మార్చి 31న అకౌంట్లో క్రెడిట్ చేసినప్పటికీ, దాని లెక్కలు మాత్రం ప్రతి నెలా లెక్కిస్తారు (Monthly compounding basis).

ఆ '5వ తేదీ' మ్యాజిక్ ఏంటి?

నిబంధనల ప్రకారం.. ప్రతి నెల 5వ తేదీ నుండి ఆ నెల చివరి రోజు వరకు మీ అకౌంట్లో ఉన్న అత్యంత తక్కువ బ్యాలెన్స్ (Minimum Balance) పైనే వడ్డీని లెక్కిస్తారు.

  • తేదీ లోపు వేస్తే: మీరు కనుక ప్రతి నెల 5వ తేదీ లోపు మీ PPF అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తే, ఆ నెలకు సంబంధించిన పూర్తి వడ్డీ మీకు వస్తుంది.
  • తేదీ దాటితే: ఒకవేళ మీరు 5వ తేదీ దాటిన తర్వాత (అంటే 6వ తేదీన లేదా ఆ పైన) డబ్బులు వేస్తే, ఆ నెలకు ఆ అమౌంట్ మీద ఒక్క రూపాయి కూడా వడ్డీ రాదు. ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ తర్వాతి నెల నుండి మాత్రమే స్టార్ట్ అవుతుంది.

ఉదాహరణకు, మీరు జూన్ 1 నుండి జూలై 5 లోపు డబ్బులు డిపాజిట్ చేస్తే.. జూన్ నెలకు కూడా వడ్డీ యాడ్ అవుతుంది. అదే మీరు జూలై 6న డిపాజిట్ చేస్తే, జూలై నెల వడ్డీ రాదు, నేరుగా ఆగస్టు నుండే లెక్క మారుతుంది.

చిన్న పొరపాటు.. ఎంత నష్టమో చూపే సింపుల్ లెక్క!

మీరు ఏడాదికి గరిష్ట పరిమితి అయిన రూ. 1.5 లక్షలను పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం.

  • ఏప్రిల్ 5 దాటిన తర్వాత డిపాజిట్ చేస్తే: మీకు కేవలం 11 నెలల వడ్డీ మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ఉన్న 7.1% వడ్డీ రేటు ప్రకారం మీకు వచ్చే వడ్డీ రూ. 9,762.50 మాత్రమే.
  • ఏప్రిల్ 5 లోపే డిపాజిట్ చేస్తే: మీకు పూర్తి 12 నెలల వడ్డీ దక్కుతుంది. అంటే మీకు వచ్చే వడ్డీ రూ. 10,650 అవుతుంది.

చూశారా.. కేవలం కొన్ని రోజులు ఆలస్యం చేయడం వల్ల దాదాపు రూ. 900 వడ్డీ నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నెలవారీ వాయిదాల (Instalments) పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తుంటే, ప్రతి నెల 5వ తేదీ లోపే మీ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY 2026-27) మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్ నుండి జూన్ వరకు) సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను విడుదల చేసింది. ఈసారి PPF తో పాటు మిగిలిన పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు, పాత రేట్లనే కొనసాగిస్తున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం పీపీఎఫ్ వడ్డీ రేటు స్థిరంగా 7.1% వద్దే కొనసాగుతోంది. ప్రభుత్వం చివరిసారిగా 2023-24 నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి 2024) పోస్టాఫీస్, బ్యాంక్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది, ఆ తర్వాత నుండి వీటిని స్థిరంగానే ఉంచుతోంది. సో.. ఇంకెందుకు ఆలస్యం, మీ పీపీఎఫ్ పెట్టుబడులను ప్రతి నెల 5వ తేదీ లోపే పూర్తి చేసి గరిష్ట లాభాలను అందుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+