ఇన్వెస్టర్లకు సురక్షిత, హామీ కలిగిన పెట్టుబడి పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాను మాత్రమే కలిగి ఉండాలి. అందుకే తమ ఉద్యోగులకు ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు తెరవడానికి దూరం ఉంటాయి. ఇండివిడ్యువల్స్ ఎవరైనా బ్యాంకులో లేదా పోస్టాఫీస్‌లో సింగిల్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ ఒకరి పేరు పైన ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే మాత్రం ఫస్ట్ ఖాతా ఎర్రెగ్యులర్‌గా పరిగణిస్తారు.
తాజాగా, కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాల విలీనంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక వ్యక్తికి ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే ఉండాలి. కొన్ని సందర్భాలలో ఒకటికి మించిన ఖాతాలను విలీనం చేసేందుకు సడలింపులు ఉన్నాయి. ఈ మేరకు తపాలాశాఖ ఒక వివరణాత్మక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

ఒకటికి మించి ఖాతాలు ఉంటే
ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటా అలాంటి ఖాతాలను క్లోజ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఏ ఖాతాను క్లోజ్ చేయాలనుకోవాలో డిపాజిటర్ ఇష్టం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే వాటిలో ఒకటి మాత్రమే ఉండేలా చూసుకోవాలి. క్లోజ్ చేసిన ఖాతాల్లోని సొమ్మును, వారు నిర్వహించాలనుకునే ఖాతాలోకి బదలీ చేసుకోవచ్చు. పోస్టాఫీస్‌లు, బ్యాంకుల ఖాతాలు కొనసాగించాలనుకునే డిపాజిటర్లు పాస్‌బుక్, బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీలతో వారికి రిక్వెస్ట్ పెట్టవచ్చు. డిపాజిటర్లు పంపిన రిక్వెస్ట్‌ను పరిశీలించిన బ్యాంకులు, పోస్టాఫీస్‌ల అధికారులు చర్యలు తీసుకుంటారు.
మీరు క్లోజ్ చేయాలనుకున్న ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ సదరు అకౌంట్లోని మొత్తాన్ని మీరు నిర్వహించాలనుకునే ఖాతాలోకి బదలీ చేస్తాయి. కొనసాగించదలచిన ఖాతా కలిగిన బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు విలీన అభ్యర్థనను పంపించాలి. పాస్‌బుక్, అకౌంట్ స్టేట్‌మెంట్ అవసరం. ఈ కేసును అకౌంట్స్ ఆఫీస్ ఈర అకౌంట్స్ కార్యాలయాలకు పంపిస్తుంది.

ఆ మొత్తం వెనక్కి
ఖాతాల్లోని డిపాజిట్లను కేంద్రం పర్యవేక్షిస్తుంది. పీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేసిన తేదీలను బట్టి, మెర్జ్ చేసిన ఖాతాలో డిపాజిట్ల మెచ్యూరిటీని లెక్కిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన సీలింగ్ కంటే ఒక ఏడాదిలో ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటే ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా ఖాతాదారులకు తిరిగి చెల్లిస్తారు. అకౌంట్స్ ఆఫీస్ బ్యాలెన్స్‌ను అకౌంట్ ఆఫీస్‌కు బదలీ చేయడానికి ముందు వడ్డీ నమోదును సర్దుబాటు చేస్తాయి.
పోస్టాఫీస్‌లో ఒక ఖాతా, బ్యాంకులో మరో ఖాతా ఉంటే.. మీరు పోస్టాఫీస్‌లో ఖాతాను కొనసాగించాలని భావిస్తే... బ్యాంకు మీకు చెక్కును జారీ చేస్తుంది.
వివిధ పోస్టాఫీస్‌లలో ఖాతాలు ఉంటే ఒకే పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు.

వడ్డీ రేటు.. రుణం
పీపీఎఫ్ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.500, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు ఉండవచ్చు. ఈ డిపాజిట్‌ను ఏకమొత్తంలో లేదా వాయిదాలలో చెల్లించుకోవచ్చు. డిపాజిట్ మొత్తం ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద మినహాయింపుకు అర్హత పొందినప్పటికీ వడ్డీ పన్ను రహితం. పీపీఎఫ్ పథకం కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక రుణాన్ని మాత్రమే తీసుకోవచ్చు. మొదటి రుణం తిరిగి చెల్లించనంత వరకు రెండో రుణం ఉండదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications