Money Multiplier: లక్షకు రెండు లక్షలు.. రూ.2 లక్షలకు రూ.4 లక్షలు కావాలా..? ఇదే సరైన పెట్టుబడి
KVP Scheme: ప్రస్తుత కాలంలో మోసాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో చాలా మంది తమ డబ్బుకు ఎక్కువ రాబడి కంటే ఎక్కువ భద్రత కావాలని కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో వీలైనంత వేగంగా తమ డబ్బులు పెరగాలని కూడా యోచిస్తున్నారు. అలాంటి వారికి తక్కువ పెట్టుబడి మార్గాలు అవకాశాలు ఉంటుంటాయి.
చాలా మంది తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలను ఉత్తమమైనవిగా పరిగణిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది కాంపౌండింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తమ డబ్బును తక్కువ సమయంలో డబుల్ చేసే సాధనాల కోసం అన్వేషిస్తుంటారు. అయితే రిస్క్ లేకుండా డబ్బులు పెంచుకునేందుకు భారతీయ పోస్టాఫీసులో ఉండే ఒక స్కీమ్ గురించి మనలో చాలా మందికి ఇప్పటికీ పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వారికి పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించే. ఇది కాలక్రమేణా సురక్షితమైన రాబడులను పెట్టుబడిదారులకు అందిస్తూ వారి డబ్బును రెట్టింపు చేస్తుంది.

గ్యారెంటీ రాబడి కారణంగా దేశంలోని ప్రముఖ పెట్టుబడి పథకాలలో ఒకటిగా ప్రజాదరణ పొందుతోంది. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర పథకం 7.5 శాతం వడ్డీ రేటును పెట్టుబడిదారులు అందుకుంటున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బుపై సురక్షిత రాబడులను అందుకోవాలని చూసే ఇన్వెస్టర్లకు KVP పథకం ఒక వరం అని చెప్పుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర అనేది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో నిర్ణీత మెుత్తంలో పెట్టుబడి పెట్టగా దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తుంది. స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసిన డబ్బు ప్రస్తుత వడ్డీ రేటు 7.5 శాతం ప్రకారం 115 నెలల కాలంలో డబుల్ అవుతుంది.
ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తనకు పెద్ద మెుత్తంలో డబ్బు వచ్చినప్పుడు దానిని రెట్టింపు చేసుకునేందుకు ఈ స్కీమ్ వైపు చూడవచ్చు. సదరు వ్యక్తి రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుత రేటు ప్రకారం రూ.10 లక్షలు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కింద ఒకే లేదా ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. కేవీపీ పథకం కింద ముగ్గురు వ్యక్తుల వరకు జాయింట్ ఖాతాను తెరవవచ్చు. KVP ఖాతాను తెరిచేటప్పుడు ఒక వ్యక్తి నామినీ వివరాలను సైతం అందించాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే నామినీకి రాబడి చెల్లించబడుతుంది.
కిసాన్ వికాస్ పత్రలో కనీసం పెట్టుబడి రూ.1,000 కంటే తక్కువతో ప్రారంభించవచ్చు. కానీ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి మెుత్తం 115 నెలల తర్వాత రెట్టింపు అవుతుంది. మధ్యలో అదనంగా ఎలాంటి డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. KVP పథకం కోసం ఆదాయం చక్రవడ్డీ పద్ధతిని ఉపయోగించి లెక్కించబడుతుంది. ఇది కాలక్రమేణా మీ పొదుపును పెంచుతుంది.


Click it and Unblock the Notifications