కరోనా దెబ్బ, డిపాజిట్లపై బ్యాంకుల్లో తగ్గిన వడ్డీరేటు: ఈ పథకాల్లో రాబడి ఎక్కువ.. కానీ!
గత ఏడాది ఆర్థిక మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా వడ్డీ రేట్లు తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో బ్యాంకులు డిపాజిట్లపై కూడా వడ్డీని తగ్గిస్తున్నాయి. 2019 జనవరి నుండి ఆరు శాతానికి పైగా ఉన్న రెపో రేటు ఇప్పుడు 4 శాతానికి దిగివచ్చింది. దీంతో రుణాలు తీసుకునే వారికి భారీ ఊరట కలుగుతుంది. కానీ డిపాజిట్ చేసే కస్టమర్లపై ప్రభావం పడుతోంది. వడ్డీ రాబడి తగ్గడంతో కొందరు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు.

వడ్డీ రేట్ల మధ్య తేడా ఎలా ఉందంటే
ఓ వైపు బ్యాంకు వడ్డీ రేట్లు భారీగా తగ్గుతుండగా, చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు గాను చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. వడ్డీని యథావిధిగా కొనసాగించడంఇది రెండోసారి. బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల మధ్య వడ్డీ రేట్ల వ్యత్యాసం 40 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మధ్య ఉంది.

బ్యాంకులు.. పోస్టాఫీస్ స్కీంలు
ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.9 శాతంగా నిర్ణయించింది. ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ 5.10 శాతం, ఐసీఐసీఐ 5 శాతం అందిస్తున్నాయి. ఇక, 5 ఏళ్ల కాలపరిమితిపై ఎస్బీఐ 5.40 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 5.3 శాతం, ఐసీఐసీఐ 5.35 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.
ఏప్రిల్-జూన్ క్వార్టర్‍లో పోస్టాఫీస్ పీపీఎఫ్, టైమ్ డిపాజిట్ స్కీంల పైన వడ్డీ రేటును 1.40 శాతం తగ్గించింది. ఆ తర్వాత వడ్డీ రేట్లను సవరించలేదు. ఏడాది కాలానికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పైన 5.5 శాతం వడ్డీ, ఐదేళ్ల కాలపరిమితిపై 6.7 శాతం వడ్డీ అందిస్తోంది.

ఆర్బీఐ సేవింగ్ బాండ్స్
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఇవి పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ వార్షిక వడ్డీ రేటు 7.15 శాతంగా ఉండటం గమనార్హం. జూలై 1వ తేదీ నుండి ఈ బాండ్స్ జారీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిని ప్రతి ఆరు నెలలకు ఓసారి సవరిస్తారు. మళ్లీ జనవరి 1న సవరణ ఉంటుంది. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌లో కనిష్టం రూ.వెయ్యి పెట్టుబడి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టవచ్చు.
దీర్ఘకాలిక పెట్టుబడి అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ శాతం 6.8 శాతంగా ఉంది.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం మంచి ఆఫర్. అలాగే ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీం ఉంది. వీటి వడ్డీ రేటు 7 శాతాని కంటే ఎక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications