పోస్టాఫీస్ స్కీమ్ సురక్షిత పెట్టుబడి. పోస్టాఫీస్‌లో వివిధ ప్రభుత్వ ప్రాయోజిత పెట్టుబడి స్కీమ్స్ ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా కారణంగా బలహీనపడింది. ఇదే మహమ్మారి సమయంలో చాలామంది పెట్టుబడి సాధనాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఎక్కువ మంది స్టాక్, బంగారంపై ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెరిగాయి. అయితే స్టాక్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. అదే సమయంలో దశ తిరిగితే భారీ రిటర్న్స్ వస్తాయి.
ఇలా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ పొందినవారు ఉన్నారు. నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కానీ పోస్టాఫీస్ స్కీంలలో రిటర్న్స్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ సురక్షిత, భద్రమైన పెట్టుబడి.

నెలకు రూ.1500
ఫైనాన్షియల్ రిస్క్‌లేని, మంచి రిటర్న్స్ ఇచ్చే పోస్టాఫీస్ పథకాల్లో గ్రామ్ సురక్ష స్కీమ్. ఇందులో నెలకు రూ.1500 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక ఇన్వెస్టర్ దీని ద్వారా రూ.35 లక్షల వరకు ఆర్జించవచ్చు. 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల మధ్య వయస్కులు పెట్టుబడి పెట్టవచ్చు.
19 ఏళ్ల వ్యక్తి 55 ఏళ్ల వరకు నెలకు రూ.1515 పెట్టుబడి పెట్టవచ్చు. 58 ఏళ్ల తర్వాత ఇన్వెస్టర్‌కు ప్రతి నెల రూ.1463 వస్తుంది. 60 సంవత్సరాలకు ప్రతి నెల రూ.1411 వస్తుంది.
మెచ్యూరిటీ తర్వాత రూ.31.60 లక్షలు వస్తాయి.
58 ఏళ్ల తర్వాత ఇన్వెస్టర్ ఉపసంహరించుకుంటే రూ.33.40 లక్షల వస్తుంది.
60 ఏళ్లకు ఉఫసంహరించుకుంటే రూ.34.60 లక్షలు వస్తుంది.
కనీసం రూ.10,000 గరిష్టంగా రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.

పెట్టుబడి ఎలా...
ఈ స్కీంలో మీరు నెలవారీ లేదా త్రైమాసికం వారీ లేదా వార్షిక ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేయవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
పెట్టుబడి పెట్టిన తర్వాత మూడేళ్లకు పాలసీని సరెండర్ చేయవచ్చు.
ఇన్వెస్టర్ అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడితే నామినీకి లేదా లీగల్ హెయిర్‌కు మనీ మొత్తాన్ని చెల్లిస్తారు.

అడ్వాన్స్ ప్రయోజనం
మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పనితీరుపై ఆధారపడవు. కాబట్టి సురక్షితమైనవి.
ఎంపిక చేసిన కాలపరిమితి కోసం స్కీంలో నిరంతరం ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడులపై అడ్వాన్స్ తీసుకోవచ్చు.
అయిదేళ్ల లోపు గ్రామ సురక్ష పథకాన్ని ముగించాలనుకుంటే బోనస్ వర్తించదు.


Click it and Unblock the Notifications