బ్యాంక్ FDలా సురక్షితంగా, కానీ మరింత గుడ్ రిటర్న్‌తో పెట్టుబడులు కావాలా? ఇండియా పోస్ట్ అందిస్తున్న 2025 సేవింగ్స్ స్కీమ్స్ మీకోసం! ఈ స్కీమ్స్ ప్రభుత్వ హామీతో రిస్క్-ఫ్రీ, సులభంగా యాక్సెస్ చేయదగ్గవి. అంతేకాక, కొన్ని స్కీమ్స్‌లో ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఇక్కడ కొన్ని అత్యంత పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి, ఇవి 8.2% వరకు వడ్డీ ఇస్తున్నాయి.
1. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS):
POMIS లో ఒకసారి పెట్టుబడి పెట్టి, నెలవారీ వడ్డీ పొందవచ్చు. స్టార్ట్ చేయడానికి కేవలం రూ. 100 నుంచి 1000 రూపాయల పైనా ఎంత వరకు అయినా పెట్టుబడి చేయొచ్చు. గరిష్ట పరిమితి రూ. 9 లక్షలు మాత్రమే. ముందస్తు మూసివేత కోసం 1 సంవత్సరం వేచి ఉండాలి, అప్పుడు చిన్న పెనాల్టీ మాత్రమే ఉంటుంది.
2. కిసాన్ వికాస్ పత్రం (KVP):
KVP ఒక సులభమైన, భద్రత కలిగిన ప్లాన్. మీరు పెట్టిన డబ్బు నిర్దిష్ట కాలంలో రెండింతలు అయ్యేలా ఉంటుంది. వార్షిక వడ్డీ 7.5% మరియు కనీసం రూ. 1,000 తో ప్రారంభించవచ్చు. రిస్క్ లేకుండా పొడుగైన కాలంలో డబ్బు పెరగడానికి ఇది మంచి ఆప్షన్.
3. సుకన్య సమృద్ధి యోజన (SSY):
ఇఇది చిన్నవయసులో ఉన్న ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. 8.2% వార్షిక వడ్డీతో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనికీ సెక్షన్ 80C కింద ట్యాక్స్ లాభం కూడా ఉంటుంది. కుమార్తె భవిష్యత్తు కోసం ఒక చకట్టి ప్లాన్.
4. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):
SCSS సీనియర్ సిటిజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రిటైర్మెంట్ ప్లాన్. ఈ స్కీమ్ 8.2% వార్షిక వడ్డీ ఇస్తుంది, అది ప్రతి మూడు నెలలకు చెల్లించబడుతుంది, అంటే నెలలుగా కాకుండా ప్రతి త్రైమాసికం ఒకసారి వడ్డీ రాబడుతుంది. ఒక్కో అకౌంట్లో మీరు 1,000 multiples లో డిపాజిట్ పెట్టవచ్చు, గరిష్టంగా ₹30 లక్షలు పెట్టవచ్చు. ఈ ప్లాన్ సీనియర్ సిటిజర్లకు స్థిరమైన ఆదాయం అందిస్తుంది, అంతేకాక ట్యాక్స్ లాభాలు కూడా ఉంటాయి, అంటే మీరు పెట్టిన డబ్బుపై కొన్ని రకాల ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.
5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC):
NSC ఒక 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటి సేవింగ్స్ ప్లాన్. దీని వడ్డీ రేటు 7.70% వార్షికం, అది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అవుతుంది. అంటే, మీరు పొందే వడ్డీ కూడా మళ్లీ పెట్టుబడిగా చేర్చబడుతుంది, తద్వారా మొత్తం ఆదాయం పెరుగుతుంది. కనీసం రూ. 1,000తో ప్రారంభించవచ్చు, మరియు గరిష్ట పరిమితి లేదు, అంటే మీరు ఎంత కావాలంటే పెట్టవచ్చు. NSC భద్రత కలిగిన ప్లాన్ కాబట్టి, మీ డబ్బు రక్షితంగా ఉంటుంది. అదనంగా, ఇది ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80C కింద ట్యాక్స్-సేవింగ్ ఆప్షన్ కూడా అందిస్తుంది అంటే మీరు పెట్టిన మొత్తం డబ్బుపై ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు.
6. రికరింగ్ డిపాజిట్ (RD):
RD లో నెలకు రూ.100 నుండి డిపాజిట్ మొదలు పెట్టి 6.70% వార్షిక వడ్డీ పొందవచ్చు. 12 నెలల తర్వాత బ్యాలెన్స్ 50% వరకు లోన్ తీసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత ముందస్తు మూసివేత, తగ్గిన రేటుతో.
7. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):
PPF ఒక లాంగ్-టర్మ్, ట్యాక్స్-ఫ్రీ సేవింగ్స్ ఆప్షన్. 7.10% వార్షిక వడ్డీ, సంవత్సరానికి రూ. 500 - రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి. మాచ్యూరిటీ 15 సంవత్సరాలు. వడ్డీ + మాచ్యూరిటీ మొత్తం ట్యాక్స్-ఫ్రీ.
8. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్:
సింపుల్ సేవింగ్స్ అకౌంట్, 4% వార్షిక వడ్డీ. రూ. 500 తో ప్రారంభించవచ్చు. ఇండివిడువల్ లేదా జాయింట్ అకౌంట్లో తెరవవచ్చు. భద్రత కలిగిన, సులభంగా డబ్బును పార్క్ చేసే మార్గం.
రూ. 3.43 లక్షల కోట్ల నష్టంలో TCS షేర్ హోల్డ్ చేయాలా? అమ్మాలా?
సేఫ్టీ, స్థిరమైన వడ్డీ, మనసు ప్రశాంతత కావాలంటే, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బెస్ట్. PPF ట్యాక్స్-ఫ్రీ, SCSS సీనియర్-ఫ్రెండ్లీ ఇన్కమ్, SSY గర్ల్-చైల్‌డ్ దృష్టి, ఇవన్నీ మీ భవిష్యత్తు కోసం సులభమైన, రిస్క్-ఫ్రీ ఆప్షన్లు. 8.2% వరకు వడ్డీతో, చిన్న సేవింగ్స్ ద్వారా కూడా భద్రమైన ఫైనాన్షియల్ ఫ్యూచర్ నిర్మించవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..



Click it and Unblock the Notifications