Post office scheme: నెలకు రూ. 9,250 గ్యారెంటీ ఆదాయం: పోస్ట్ ఆఫీస్‌లో ఈ ఒక్క స్కీమ్ ఉంటే చాలు..
పెట్టుబడి పెట్టే వారు కేవలం భద్రత మాత్రమే కాదు, మంచి రిటర్న్స్ కూడా ఆశిస్తారు. మీరు కూడా మీ డబ్బు సురక్షితంగా ఉండాలి, అలాగే ప్రతి నెలా కొంత ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్ (post office scheme). దీని పేరే 'మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్' (MIS). ఈ పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే, ఐదేళ్ల పాటు ప్రతి నెలా నిర్ణీత ఆదాయం మీ అకౌంట్‌లో జమ అవుతుంది.

ఎవరు ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
ఈ పోస్టాఫీస్ స్కీమ్ (post office scheme) లో ఎవరైనా భారతీయ పౌరులు చేరవచ్చు. ఇది ఒక వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.
- సింగిల్ అకౌంట్: ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
- జాయింట్ అకౌంట్: ముగ్గురు వ్యక్తులు కలిసి (Joint Account) గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. చిన్నపిల్లల పేరు మీద లేదా మానసిక వైకల్యం ఉన్నవారి తరపున వారి గార్డియన్స్ కూడా ఈ అకౌంట్ తెరవడానికి అవకాశం ఉంది.
నెలకు రూ. 9,250 ఆదాయం ఎలా వస్తుంది?
ఈ పథకంలో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీకు వచ్చే వడ్డీ ఆధారపడి ఉంటుంది.
- రూ. 15 లక్షల డిపాజిట్: మీరు జాయింట్ అకౌంట్ ద్వారా రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, నెలకు మీకు రూ. 9,250 వడ్డీ రూపంలో వస్తుంది. అంటే ఏడాదికి మీరు రూ. 1.11 లక్షల ఆదాయం పొందుతారు.
- రూ. 9 లక్షల డిపాజిట్: సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 9 లక్షలు పెడితే, ప్రతి నెలా రూ. 5,550 వస్తుంది. అంటే ఏడాదికి రూ. 66,600 ఆదాయం మీ సొంతం.
ఈ పథకం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత మీరు పెట్టిన అసలు సొమ్ము (Principal Amount) మీకు తిరిగి ఇచ్చేస్తారు.
ముఖ్యమైన ఫీచర్లు , నియమాలు
ఈ స్కీమ్ ఇన్వెస్టర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
- విత్‌డ్రా సౌకర్యం: ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ఎప్పుడైనా మీరు అకౌంట్ క్లోజ్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఐదేళ్ల కంటే ముందే క్లోజ్ చేస్తే నిబంధనల ప్రకారం కొంత మొత్తం కోత ఉంటుంది.
- వడ్డీ జమ: మీకు వచ్చే నెలవారీ వడ్డీ నేరుగా మీ సేవింగ్స్ అకౌంట్‌కు లేదా బ్యాంక్ అకౌంట్‌కు వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ నెల వడ్డీ తీసుకోకపోతే, దానిపై అదనంగా మళ్ళీ వడ్డీ రాదు.
- భద్రత: స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉంటుంది, కానీ ఈ పోస్టాఫీస్ స్కీమ్ (post office scheme) ప్రభుత్వ పథకం కాబట్టి మీ డబ్బుకు వంద శాతం భద్రత , గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి.
తక్కువ రిస్క్ తో, నెలకు ఒక స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లేదా రిటైర్ అయిన వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.


Click it and Unblock the Notifications