మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్కిం మీకు ఖచ్చితంగా సరిపోతుంది! మీకు పోస్ట్ ఆఫీస్ అందించే ఈ అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మీరు అలాగే మీ జీవిత భాగస్వామి ప్రతినెల పెన్షన్ రూ. 9,250 పొందవచ్చు, ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీకు కానుకగా వస్తుంది. ఈ పథకాన్ని మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) అని కూడా అంటారు. మీరు మీ సేవింగ్స్ నుండి కొంత ఆదాయాన్ని సంపాదించడానికి ఒక నమ్మకమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు సరైన అప్షన్ కావచ్చు.
పోస్ట్ ఆఫీస్ నుండి ప్రతినెల ఆదాయ పథకం చాలా సురక్షితమైన పెట్టుబడి అప్షన్. ఈ స్కీమ్‌లో పాల్గొనడం ద్వారా మీరు సేఫ్టీ ఇంకా ఆకర్షణీయమైన రాబడి రెండింటినీ ఖచ్చితం చేస్తూ మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన నష్టాలను నివారించవచ్చు. మీ ఆదాయ పథకం 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇంకా మీరు కనీసం రూ. 1,000తో పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు. ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

మొదటి అప్షన్ ఒకే అకౌంట్ అంటే సింగిల్ అకౌంట్ మీరు ఓపెన్ చేయవచ్చు, రెండవ అప్షన్ జాయింట్ అకౌంట్ కోసం. మీరు ఒకే సింగిల్ అకౌంట్ ఓపెన్ చేయకనుకుంటే మీరు రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ కోసం గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ కింద ఒకే అకౌంట్లో రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతినెల రూ.5,550 పెన్షన్ అందుతుంది. మరోవైపు, మీరు మీ భార్యతో జాయింట్ అకౌంట్లో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే మీరు సంవత్సరానికి రూ. 9,250 సంపాదిస్తారు, మొత్తం మీద ప్రతి సంవత్సరం రూ. 1,11,000 వడ్డీ అందిస్తుంది. ఈ పోస్టాఫీసు పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో కూడా వస్తుందని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications