పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) డొమెస్టిక్, ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇవి సెప్టెంబర్ 01, 2021 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంకు తన కస్టమర్లకు PNB ఉన్నతి సేవింగ్స్ ఫండ్ అకౌంట్, PNB సేవింగ్స్ అకౌంట్ ప్రోడక్ట్(ప్రీమియమ్ కస్టమర్స్), PNB ఎస్ఎఫ్ ప్రుడెంట్ స్వీప్ డిపాజిట్ స్కీం(ఇండివిడ్యువల్స్), PNB ఎస్ఎఫ్ ప్రుడెంట్ స్వీప్ ఫర్ ది అకౌంట్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, PNB జూనియర్ ఎస్ఎఫ్ అకౌంట్, బేసిక్ సేవింగ్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్(BSBDA), PNB రక్షక్ స్కీమ్, స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ(పెన్షనర్స్), PNB పవర్ సేవింగ్స్, PNB సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్స్, PNB మై శాలరీ అకౌంట్, ప్రీమియం సేవింగ్ అకౌంట్ PNB బెస్ట్ కస్టమర్, PNB ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్, PNB సెలక్ట్ సేవింగ్స్ అకౌంట్ తదితర స్కీమ్స్ ఉన్నాయి. PNB సవరించిన తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే
సెప్టెంబర్ 1, 2021 నుండి బ్యాంకు దేశీయ, ఎన్నారై సేవింగ్స్ ఖాతాల పైన వడ్డీ రేట్లను సవరించింది. సవరణ తర్వాత బ్యాంకు అన్ని సేవింగ్స్ ఫండ్స్ అకౌంట్స్ పైన 2.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ పైన పది బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేటును తగ్గించింది. రూ.100 కోట్ల కంటే తక్కువ సేవింగ్స్ ఫండ్ అకౌంట్ పైన వడ్డీ రేటు 2.9 శాతం వరకు ఉంటోంది. ఇదివరకు వడ్డీ రేటు 3 శాతం కాగా, ఇప్పుడు 2.9 శాతంగా ఉంది. రూ.100 కోట్ల కంటే ఎక్కువ మొత్తంపై 3 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే
- రూ.100 కోట్ల కంటే తక్కువ సేవింగ్స్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ - వడ్డీ రేటు 2.90%
- రూ.100 కోట్ల కంటే ఎక్కువ సేవింగ్స్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ - వడ్డీ రేటు 2.90%
- అన్ని సేవింగ్స్ ఫండ్ అకౌంట్స్‌కు అప్లికెబుల్.
- బల్క్ డిపాజిట్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే మీ దగ్గరలోని బ్రాంచీని సందర్శించాలి.

PNB ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
PNB ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను గత నెల ఒకటో తేదీ నుండి సవరించింది. తాజా సవరణ తర్వాత జనరల్ పబ్లిక్‌కు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ పైన 2.90 శాతం వడ్డీ రేటు నుండి 5.25 శాతం వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు వడ్డీ రేు 3.40 శాతం నుండి 5.75 శాతం మధ్య ఉంది.
- 7 to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.9 - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.4,
- 15 to 29 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.9 - 3.4,
- 30 to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.9 - 3.4,
- 46 to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25, 3.75,
- 91 to 179 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.8 - 4.3,
- 180 days to 270 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.4 - 4.9,
- 271 days to less than 1 year - రెగ్యులర్ వడ్డీ రేటు 4.4 - 4.9,
- 1 year 5 5.5 above 1 year & upto 2 years - రెగ్యులర్ వడ్డీ రేటు 5 - 5.5,
- above 2 years & upto 3 years - రెగ్యులర్ వడ్డీ రేటు 5.1 - 5.6,
- above 3 years & upto 5 years - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25 - 5.75,
- above 5 years & upto 10 years - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25 - 5.75

PNB సేవింగ్స్ అకౌంట్ క్యాష్ ఉపసంహరణ పరిమితి
ప్లాటినమ్...
- నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు - రూ.50000,
- నగదు ఉపసంహరణ పరిమితి ఒకసారి - 20000,
- ECOM/POS కన్సాలిడేటెడ్ పరిమితి - 125000,
క్లాసిక్...
- నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు - 25000,
- నగదు ఉపసంహరణ పరిమితి ఒకసారి - 20000,
- ECOM/POS కన్సాలిడేటెడ్ పరిమితి - 60000,
గోల్డ్...
- గోల్డ్ క్యాష్ ఉపసంహరణ పరిమితి రోజుకు 50000,
- నగదు ఉపసంహరణ పరిమితి ఒకసారికి 20000,
- ECOM/POS కన్సాలిడేటెడ్ పరిమితి 125000.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications