For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD rate hike: ఈ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక రెపో రేట్లను ఇటీవల 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో దాదాపు రెండేళ్ల పాటు నాలుగు శాతంగా ఉన్న వడ్డీ రేటు 4.40 శాతానికి పెరిగింది. ఆర్బీఐ వడ్డీ రేటు పెంచిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పెంచుతున్నాయి. అలాగే కస్టమర్ల డిపాజిట్స్ పైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును పెంచాయి. ఇందులో ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా, బంధన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి.

కొటక్ మహీంద్రా

కొటక్ మహీంద్రా

కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల నుండి 50 బేసిస్ పాయింట్ల మధ్య పెంచింది.

7 రోజుల నుండి 14 రోజుల కాల పరిమితిపై సాధారణ వడ్డీ రేటు 2.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3 శాతానికి పెరిగింది. ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 5.25 శాతం, సీనియర్ సిటిజన్ 5.75 శాతం వడ్డీ రేటు ఉంది.

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 3 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75 శాతంగా ఉంది. ఆరు నెలల నుండి 1 ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. గరిష్ట వడ్డీ రేటు రెండేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 6.25 శాతం ఉంది. సీనియర్ సిటిజన్లకు 7 శాతం ఇస్తోంది.

PNB

PNB

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. PNB వివిధ కాలపరిమితులపై వడ్డీ రేటును 60 బేసిస్ పాయింట్లు పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్స్ పైన 10 నుండి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. 30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 60 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు మే 7వ తేదీ నుండి అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది.

English summary

FD rate hike: ఈ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు | PNB, Kotak Mahindra, ICICI Bank, Bandhan Bank, Others Hike FD Interest Rates

At least five banks, including ICICI Bank, Kotak Mahindra Bank, Bandhan Bank, bank of Baroda and Jana Small Finance Bank have hiked their fixed deposit interest rates.
Story first published: Saturday, May 7, 2022, 15:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X