ముంబై: బంగారం పైన రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? పంజాబ్ నేషనల్ బ్యాంకు మీకో గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం, జ్యువెల్లరీ, సావరీన్ గోల్డ్ బాండ్స్ పైన ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఏడాదిన్నరగా తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. బంగారం రుణం సెక్యూర్డ్ కాబట్టి కాస్త తక్కువగానే ఉంటుంది. అదే పర్సనల్ లోన్ ఎక్కువగా ఉంటుంది. బంగారం రుణాలపై పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పుడు మరింత వడ్డీ రేటును తగ్గించి కస్టమర్లకు ఊరటను ఇచ్చింది. బంగారం, బంగారు ఆభరణాలు, సావరీన్ గోల్డ్ బాండ్స్ పైన రుణ వడ్డీ రేటను 145 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. సావరీన్ గోల్డ్ బాండ్స్ పైన 7.2 శాతం, బంగారు ఆభరణాలపై 7.3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఈ రుణాలపై కూడా
హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గించింది. 6.60 శాతం వడ్డీకే రుణాలను అందిస్తోంది. అలాగే 7.15 శాతం వడ్డీకి కారు లోన్, 8.95 శాతం వడ్డీ రేటుకి వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటీవల హోమ్ లోన్స్, వెహికిల్ లోన్స్ పైన ప్రకటించిన విధంగా ఇప్పుడు పండగ సీజన్‌లో గోల్డ్ జ్యువెల్లరీ, సావరిన్ గోల్డ్ బాండ్స్ పైన సర్వీస్ ఛార్జీలు/ ప్రాసెసింగ్ ఫీజును పంజాబ్ నేషనల్ బ్యాంకు రద్దు చేసింది. హోమ్ లోన్ తీసుకునే వారు రుణ మొత్తంపై ఎలాంటి అప్పర్ సీలింగ్ లేకుండా ఆస్తి వ్యాల్యూలో 80 శాతం వరకు పొందవచ్చు.

గోల్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు
గోల్డ్ లోన్ కోసం చూస్తుంటే కొన్ని ప్రముఖ బ్యాంకులు, NBFCలు ఇచ్చే రుణ వడ్డీ ఆఫర్లు ఇక్కడ చూడండి. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7 శాతం నుండి 29 శాతం వరకు ఉన్నాయి. బ్యాంకుల్లో తక్కువ, ఎన్బీఎఫ్‌సీల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉదారణకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుండి 7.5 శాతం (ఇప్పుడు కాస్త తగ్గించింది), కెనరా బ్యాంకులో 7.35 శాతంగా ఉంది.

ఆఫర్ల మీద ఆఫర్లు
ఇటీవల హోమ్ లోన్స్ పైన వివిధ బ్యాంకులు వడ్డీ రేటును భారీగా తగ్గించాయి. పండుగ సీజన్‌లో సేల్స్ పెంచుకోవడానికి బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించాయి. దాదాపు అన్ని బ్యాంకులు కూడా పండుగ సీజన్‌లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం లోపు అందిస్తున్నాయి. భారత దిగ్గజ బ్యాంకులు ప్రస్తుతం వడ్డీరేటును పదేళ్ల కనిష్టానికి తగ్గించాయి. దీనికి తోడు హోమ్ బిల్డర్స్ ఇళ్లను, ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా రియాల్టీ దిగ్గజం కుదేలయింది. గత కొద్ది రోజులుగా కోలుకుంటోంది. ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో ఈ పండుగ సీజన్‌ను ఉపయోగించుకొని, డిమాండ్‌ను పెంపొందించేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ వడ్డీ రేట్లు తగ్గించడం, ఆఫర్లు ఇవ్వడం చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వివిధ కారణాలతో సొంతిళ్లకు డిమాండ్ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నందున విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. డిమాండ్‌ను మరింత పెంచేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ ప్రత్యేక వడ్డీ రేటు తగ్గింపు, ఆఫర్లు ఇస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications