For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు

|

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కస్టమర్లకు ఓ గమనిక. మోసాలు, కార్డు క్లోనింగ్‌ను తనిఖీ చేసే ప్రయత్నంలో దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకు ఓ అడుగు ముందుకు వేసింది. నాన్-ఈఎంవీ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ (ATM) నుండి నగదు ఉపసంహరణకు కస్టమర్లను అనుమతించదు. తమ కస్టమర్లకు మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. టెక్నాలజీ పెరుగుతుంటే ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయిఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి

మోసపూరిత ట్రాన్సాక్షన్స్ నుండి కాపాడేందుకు

మోసపూరిత ట్రాన్సాక్షన్స్ నుండి కాపాడేందుకు

గత సంవత్సరం ఒక సర్వే నిర్వహించిన సందర్భంలో కస్టమర్లు డిజిటల్ చెల్లింపులపై తమ ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలో తాజా చర్య తీసుకున్నట్లు PNB తెలిపింది. 'తమ గౌరవనీయులైన కస్టమర్లను మోసపూరిత ఏటీఎం కార్యకలాపాల నుండి రక్షించేందుకు, వచ్చే నెల నుండి ఈఎంవీయేతర ఏటీఎం యంత్రాల నుండి ట్రాన్సాక్షన్స్‌ను పరిమితం చేస్తుందని, డిజిటల్‌ను ఉపయోగించడం, సురక్షితంగా ఉండండి అని PNB ట్వీట్ చేసింది.

ఫిబ్రవరి 1 నుండి

ఫిబ్రవరి 1 నుండి

నాన్-ఈఎంవీ ఏటీఎం మెషీన్‌ల ద్వారా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలను ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఏటీఎం మోసాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంటే PNB కస్టమర్లు నాన్-ఈఎంవీ ఏటీఎంల నుండి డబ్బులు తీసుకోలేరు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మెషీన్‌లో కార్డు పెట్టిన తర్వాత వెంటనే వెనక్కి తీసుకోగలిన పక్షంలో ఆ ఏటీఎంలను నాన్-ఈఎంవీ ఐటీఎంలు అంటారు.

గత నెలలో నగదు ఉపసంహరణపై

గత నెలలో నగదు ఉపసంహరణపై

ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకు నగదు ఉపసంహరణ పాలసీని కూడా మార్చింది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ మార్పులు చేసింది. ఈ పాలసీ ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ క్యాష్ ఉపసంహరించుకుంటే వన్ టైమ్ పాస్ వర్డ్ తప్పనిసరి. ఇది రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు వర్తిస్తుంది. ఈ వన్ టైమ్ పాస్ వర్డ్ కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.

English summary

PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు | PNB customers alert: THESE ATM machines will not dispense cash for you

In an attempt to check frauds and card cloning, the Punjab National Bank (PNB), one of the country's largest public sector banks, has taken a giant step and won't allow its customers to withdraw money from non-EMV automated teller machines (ATMs).
Story first published: Friday, January 22, 2021, 10:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X