హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? సాధారణంగా గృహ రుణం కాల పరిమితి పదిహేను సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి హోమ్ లోన్ పొందాలని ప్లాన్ చేస్తున్నవారు తప్పనిసరిగా దీర్ఘకాలిక ఆర్థిక నిబద్దత కోసం తమను తాము బలపరుచుకోవాలి. రుణగ్రహీతకు హోమ్ లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు వారి క్రెడిట్ యోగ్యత కోసం వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతలు ఈ నాలుగు కీలక పాయింట్లను తెలుసుకోవాలి.

డౌన్ పేమెంట్
హోమ్ లోన్స్ కోసం బ్యాంకులు 75 శాతం నుండి 90 శాతం వరకు రుణాన్ని అందిస్తాయి. మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులు సిద్ధం చేసుకోవాలి. మీరు ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే మీ వద్ద పది శాతం నుండి 25 శాతం వరకు చేతిలో ఉండేలా చూసుకోవాలి. అంటే ఆ మొత్తాన్ని ఇంటి కోసం డౌన్ పేమెంట్‌గా చెల్లించడానికి సిద్ధం చేసుకోవాలి. ఇంటి కొనుగోలుదారులు సాధ్యమైనంత మేర ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే, క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే కాస్త తక్కువ వడ్డీ రేటుకే హోమ్ అప్రూవల్‌కు అవకాశం ఉంటుంది.

క్రెడిట్ స్కోర్
సాధారణంగా బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోర్ అంటే 750 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉండవచ్చు. హోమ్ లోన్ తీసుకోవడానికి రుణగ్రహీతలు క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికి అప్పుడు చెక్ చేసుకోవాలి.

ఈఎంఐ సామర్థ్యం
హోమ్ లోన్ తీసుకుంటే నెలకు మన ఆదాయం ఎంత, ఎంత మొత్తం చెల్లించగలుగుతాం అనే అంశాన్ని బట్టి ఈఎంఐ ఉండేలా చూసుకోవాలి. మన ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ 50 శాతం నుండి 60 శాతం ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ మొత్తం సగం వరకు ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే లాంగ్ టర్మ్‌లో మనకు అనుకూలమైన ఈఎంఐని ఎంచుకోవాలి. ఈఎంఐ చెక్ చేయడం కోసం ఆన్ లైన్ హోమ్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించాలి.

ఆర్థిక అత్యవసరాలు
అనుకోకుండా వచ్చే ఆర్థిక అత్యవసరాలు మన రుణ చెల్లింపులు లేదా ఈఎంఐ పైన ప్రభావం చూపుతాయి. ప్రతి నెల గడువు తారీఖున ఈఎంఐ మొత్తాన్ని చెల్లించని పక్షంలో పెద్ద మొత్తంలో పెనాల్డీ ఉంటుంది. కాబట్టి రుణ చెల్లింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక అత్యవసరాల వంటి అంశాలు ప్రభావం చూపినప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్లాన్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications