అత్యవసర సమయంలో వ్యక్తులు చాలామంది బంగారం రుణం, వ్యక్తిగత రుణం తీసుకుంటారు. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. ఆ తర్వాత పర్సనల్ లోన్‌ను ఎంచుకుంటారు. వ్యక్తిగత లోన్ కంటే బంగారం పైన రుణాలకు కాస్త తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. బంగారం సెక్యూర్డ్ అయితే, పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ లోన్. కాబట్టి పర్సనల్ లోన్ పైన వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. బంగారం రుణాలు లేదా వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి ముందు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

వడ్డీ రేటు
దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వివిధ బ్యాంకులు పర్సనల్ లోన్ పైన 10 శాతం నుండి 24 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. వడ్డీ రేటు రిస్క్ అసెస్‌మెంట్ ఆధారంగా, ఆయా బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ సంస్థలు బంగారం రుణాలపై 7 శాతం నుండి 29 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. అధిక రుణాలు తీసుకుంటే వడ్డీ రేట్లు కాస్త తగ్గుతాయి.

రుణ మొత్తం
రుణ మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వ్యక్తిగత లోన్ సాధారణంగా రూ.50,000 నుండి రూ.15 లక్షల వరకు ఇస్తారు. కొంతమంది రూ.30 లక్షల నుండి 40 లక్షల వరకు కూడా పర్సనల్ లోన్ ఇస్తారు. ఇక బంగారంపై రుణం అంటే బంగారం వ్యాల్యూ పైన 75 శాతం ఇస్తారు.

ఎన్ని రోజుల్లోపు వస్తాయి
పర్సనల్ లోన్ తీసుకోవడానికి రుణ గ్రహీతలు తమ ఐటీ రిటర్న్ ఫామ్స్, పే-స్లిప్స్, ఇతర డాక్యుమెంట్స్ అవసరం. వ్యక్తిగత రుణం అకౌంట్లో పడడానికి రెండు రోజుల నుండి ఏడు రోజుల సమయం పడుతుంది. ఇటీవల కొద్ది గంటల్లోనే పడుతుంది. బంగారం రుణం అత్యంత వేగంగా మంజూరు అవుతుంది.

రీపేమెంట్ కాలం
సాధారణంగా వ్యక్తిగత రుణం రీపేమెంట్ కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లు ఉంటుంది. గరిష్టంగా ఏడేళ్లు కూడా ఉండవచ్చు. బంగారం రుణాలు గరిష్ట కాలపరిమితి మూడు సంవత్సరాలు. కొన్ని సందర్భాల్లో నాలుగైదు సంవత్సరాలు కూడా ఉంటాయి. అలాగే, ప్రాసెసింగ్ ఫీజును కూడా పరిగణలోకి తీసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications