బంగారం రుణాలపై మోతీలాల్ ఓస్వాల్ సంచలన నివేదిక.. ఇండియన్లు ఎంత తెలివైన వాళ్లంటే..

భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా లేదా సంపదగా దాచుకునే సాధనంగానే కాకుండా.. అవసరాలకు తక్షణ నిధులు సమకూర్చే కీలక రుణ వనరుగా రూపాంతరం చెందుతోంది. అసురక్షిత వ్యక్తిగత రుణాల కంటే తక్కువ వడ్డీ, వేగవంతమైన పంపిణీకి సౌకర్యం ఉండటంతో గృహాలు, చిన్న వ్యాపారాలు (MSMEలు) పసిడి రుణాల వైపు విపరీతంగా మొగ్గు చూపుతున్నాయి. ప్రముఖ ఆర్థిక సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన మార్నింగ్ ఇండియానివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో ఈ విభాగం నాలుగు రెట్లు పెరిగి మార్చి 2026 నాటికి రూ. 18.6 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో రిటైల్ రంగాన వ్యక్తిగత రుణాలను వెనక్కి నెట్టి పసిడి రుణాలు రెండో అతిపెద్ద ఆస్తి వర్గంగా నిలిచాయి.

Gold ధరలు 60 శాతానికి పైగా పెరగడం, వ్యాపార నిర్వహణ మూలధనానికి పసిడి రుణాలు సులభమైన ప్రత్యామ్నాయంగా మారడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఈ విభాగం ఏటా 50 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. రాబోయే FY26-FY28 మధ్యకాలంలో ఈ మార్కెట్ 28 శాతం చక్రవడ్డీ రేటుతో (CAGR) వృద్ధి చెంది, మార్చి 2028 నాటికి రూ. 30 లక్షల కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు.

gold loans gold loan India personal loans gold loan vs personal loan secured credit unsecured credit gold loan demand gold loan trend 2026 gold-backed loans Indian borrowers gold loan benefits gold loan interest rates loan against gold gold loan market India retail credit India vs

గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. పరిమిత పత్రాలు, వేగవంతమైన ప్రక్రియ, సులువైన ఈఎంఐ సదుపాయాల వల్ల చిన్న వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ (MFI) రుణగ్రహీతలు ఈ రుణాలను ఎంచుకుంటున్నారు. అసురక్షిత వ్యక్తిగత రుణాలతో పోలిస్తే పసిడి రుణాలు తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తాయి. సబ్-ప్రైమ్ విభాగంలో పర్సనల్ లోన్ బకాయిలు తగ్గి, Gold రుణాలు పెరగడం ఈ మార్పుకు నిదర్శనం.భారతీయ గృహాల వద్ద ₹380-390 ట్రిలియన్ల విలువైన దాదాపు 28,000 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుతం వ్యవస్థీకృత మార్కెట్ ద్వారా ఈ నిల్వలో కేవలం 8 శాతాన్ని మాత్రమే రుణాలుగా వినియోగించుకుంటున్నారు. ఇది మున్ముందు ఈ మార్కెట్ విస్తరణకు ఉన్న అవకాశాలను సూచిస్తోంది.

Also Read

సాంప్రదాయకంగా దక్షిణ భారతదేశం పసిడి రుణాల వ్యాపారంలో 75 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఈ సంస్కృతి ఇతర రాష్ట్రాలకూ వేగంగా విస్తరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రాజస్థాన్ (78%), మహారాష్ట్ర (61%), ఉత్తర ప్రదేశ్ (58%) రాష్ట్రాలు పరిశ్రమ సగటు 50 శాతం కంటే అధిక వృద్ధిని సాధించాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (NBFC) తమ శాఖలను విస్తరిస్తుండటంతో పసిడి రుణాలు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన క్రెడిట్ వనరుగా స్థిరపడుతున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+