పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..లేదంటే వాళ్ల టార్చర్ ప్రతిరోజూ అనుభవించాలి..
ఈ రోజుల్లో రుణం అవసరం ఎప్పుడూ ఉండవచ్చు. వ్యక్తిగత రుణాలు ఎలాంటి హామీ అవసరం లేకుండా, తక్కువ కాగితపు పనితో సౌలభ్యాన్ని అందిస్తాయి. ఇవి ఊహించని ఖర్చులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు లేదా ఇతర అత్యవసర అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. అందువల్ల, ఈ రుణాలు ప్రజాదరణ వేగంగా పెరుగుతున్నాయి. అయితే, వీటికి అధిక వడ్డీ రేట్లు ఉండడం, తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం భవిష్యత్తులో గణనీయమైన అప్పులు తెచ్చివేయడం చాలా ప్రమాదకరం.
ముఖ్యంగా, మీకు అవసరం లేనప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోవడం తప్పించాలి. రుణం ఖచ్చితంగా అవసరమైన సందర్భంలో మాత్రమే తీసుకోవాలి. మీరు సులభంగా తిరిగి చెల్లించగలిగే మొత్తాన్ని మాత్రమే తీసుకోవాలి. ప్రతి చిన్న ఖర్చుకు రుణం అవసరం లేదు, కాబట్టి మీరు రుణం ఎందుకు తీసుకుంటున్నారో ఆలోచన చేసుకోవడం ముఖ్యం.

వ్యక్తిగత రుణాలు మాత్రమే కాకుండా, గృహ రుణాలు, ఆటో రుణాలు కూడా ప్రత్యేక నిబంధనలు, షరతులతో వస్తాయి. అందువల్ల, రుణం తీసుకునే ముందు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ యొక్క షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, కాలపరిమితులు, ముందస్తు చెల్లింపు రుసుములు, దాచిన ఛార్జీలు ఉంటాయి. ఇవి రుణ ఖర్చును పెంచే అవకాశం ఉన్నందున, పత్రాలను పూర్తిగా చదవడం చాలా ముఖ్యం.
అనేక వనరుల నుండి ఒకేసారి రుణాలు తీసుకోవడం కూడా ప్రమాదకరం. అవసరమైనప్పుడు, ఒక్క బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి మాత్రమే రుణం తీసుకోవడం మంచిది. రుణ వడ్డీ రేట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే చిన్న వ్యత్యాసం కూడా మొత్తం చెల్లింపును గణనీయంగా పెంచుతుంది. కావున, ఏజెంట్ సలహాపై మాత్రమే ఆధారపడకుండా, వడ్డీ రేట్లను పోల్చడం చాలా ముఖ్యం.
వ్యక్తిగత రుణం అసురక్షిత రుణం ( unsecured loan) గా ఉంటుంది. కాబట్టి అందులో హామీ అవసరం లేదు. అది అధిక రిస్క్ కారణంగా వడ్డీ ఎక్కువ ఉంటుంది. తక్కువ కాలానికి రుణం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ కాలం రుణం తీసుకుంటే వడ్డీ ఎక్కువగా చెల్లించాలి. రుణం తిరిగి చెల్లించడానికి ప్రయత్నం వేగంగా చేయాలి. EMIలను సకాలంలో చెల్లించడం అత్యంత ముఖ్యం. ఆలస్యం జరిగితే జరిమానాలు, అదనపు వడ్డీ, క్రెడిట్ స్కోర్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి, భవిష్యత్తులో కొత్త రుణాలు పొందడం కష్టతరం అవుతుంది.
ఏదేమైనా Personal loan సౌలభ్యం ఇస్తాయి కానీ జాగ్రత్తతో, అవసరానికి అనుగుణంగా మాత్రమే తీసుకోవడం మంచిది. పత్రాలు, షరతులు, వడ్డీ రేట్లు, వ్యక్తిగత ఆర్థిక సామర్ధ్యాన్ని ముందుగా పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో రుణ ఉచ్చులో చిక్కకుండా ఉండవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications