మీరు ఓ ఎన్‌ఆర్‌ఐ(NRI) అయితే, ఇండియాలో మీ కుటుంబానికి అవసరమైనప్పుడు డబ్బు సాయం చేయడానికి మీ దగ్గర లేకపోయినా మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎలాంటి అవసరాలకైనా ఇంటి మరమ్మత్తు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అవసరాలకు డబ్బు అవసరమైతే, భారతీయ బ్యాంకులు మీకు సులభంగా లోన్లు ఇస్తాయి. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే, ఆన్‌లైన్‌లోనే అప్లై చేయవచ్చు. వెంటనే మీ భారత్ ఖాతాలో డబ్బు పొందవచ్చు. అయితే, భారతీయ పౌరులతో పోలిస్తే కొన్ని అదనపు నిబంధనలు, డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

ఎన్‌ఆర్‌ఐ పర్సనల్ లోన్‌కు అర్హత:
ఎన్‌ఆర్‌ఐ పర్సనల్ లోన్‌కు అప్లై చేసే అప్లికెంట్ కి 21 సంవత్సరాలు వచ్చి ఉండాలి. ఇతర దేశాలలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ప్రస్తుత సంస్థలో కనీసం 1 సంవత్సరం పని చేసి ఉండాలి. ఎన్‌ఆర్‌ఐగా గుర్తుంపు పొందాలి(అంటే భారతదేశం నుంచి బయట ఏ దేశంలో అయిన ఏడాదిలో కనీసం 183 రోజులు గడిపినవారై ఉండాలి). భారతదేశంలో నివసించే సభ్యుడు, భార్య/భర్త, తల్లి/తండ్రి, సోదరుడు/సోదరి) కో-అప్లికెంట్ లేదా నామినీ కచ్చితంగా ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్లు:
ఎన్‌ఆర్‌ఐలు లోన్ కోసం అప్లై చేయాలంటే, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను తప్పనిసరిగా బ్యాంకుకి సమర్పించాల్సి ఉంటుంది. మొదటగా, పాస్‌పోర్ట్ మరియు వీసా లేదా రెసిడెంట్ పర్మిట్ కాపీ అవసరం. అలాగే, వారు విదేశాల్లో సంపాదిస్తున్న ఆదాయాన్ని నిరూపించేందుకు సాలరీ స్లిప్స్(6 నెలలు) మరియు గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్‌లు ఇవ్వాలి. వారు భారతదేశంలో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని నిరూపించేందుకు NRE లేదా NRO ఖాతా వివరాలను సమర్పించాలి. దీనితో పాటు, విదేశాల్లోని నివాసానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్, అలాగే భారతదేశంలో ఉన్న అడ్రస్ ప్రూఫ్ కూడా సమర్పించాలి. కొంతమంది బ్యాంకులు పవర్ ఆఫ్ అటార్నీ కూడా అడుగుతున్నారు. PAN కార్డు ఉండటం ఒక కీలకమైన అంశం. 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు. అంతేకాకుండా, భారతదేశంలో ఉండే కో-అప్లికెంట్ యొక్క PAN, అడ్రస్ ప్రూఫ్ మరియు ఆదాయం సంబంధిత డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. కో-అప్లికెంట్ యొక్క క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా 650 పైన ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా ఉండటం వల్ల లోన్ ప్రక్రియ మరింత వేగవంతంగా మరియు సులభంగా జరిగే అవకాశం ఉంటుంది.
ఎన్‌ఆర్‌ఐగా భారతదేశంలో పర్సనల్ లోన్ పొందే ప్రక్రియను అనుసంధానంగా, దశల వారీగా చేపట్టాలి. ముందుగా, SBI, HDFC, ICICI, Axis వంటి బ్యాంకులను పరిశీలించి, వాటి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలను పోల్చుకోవాలి. తర్వాత, మీరు భారతదేశంలో ఉంటే బ్రాంచ్ ద్వారా లేదా విదేశాల్లో ఉంటే ఆన్‌లైన్ లేదా పోస్టు ద్వారా లోన్ కి అప్లై చేయవచ్చు. దీనిలో అత్యంత కీలకమైన అంశం భారతదేశంలో ఒక కో-అప్లికెంట్ (సహ-దరఖాస్తుదారు) ను ఎంపిక చేసుకోవడం. ఇది మీ తరఫున అన్ని బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించేందుకు అవసరం. లోన్ కి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను బ్యాంక్‌కి సమర్పించిన తర్వాత, బ్యాంక్ వాటిని పరిశీలించి, క్రెడిట్ స్కోర్ మరియు ఆదాయాన్ని అంచనా వేసి రుణాన్ని ఆమోదిస్తుంది. ఆమోదం తర్వాత, లోన్ మొత్తం భారతదేశంలోని మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేయబడుతుంది. ఈ ప్రక్రియ అంతా సరళంగా జరిగేలా ఉండేందుకు ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం.
ఎన్‌ఆర్‌ఐలు పొందే పర్సనల్ లోన్ విషయంలో కొన్ని ప్రముఖ భారతీయ బ్యాంకులు అత్యుత్తమ ఎంపికలు అందిస్తున్నాయి. ఉదాహరణకు, ICICI బ్యాంక్ రూ.50 లక్షల వరకు రుణాన్ని ఆఫర్ చేస్తూ, 10.85% ప్రారంభ వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 5 నుండి 6 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించదగిన గరిష్ఠ కాలపరిమితిని కలిగి ఉంది. అదే విధంగా, HDFC బ్యాంక్ రూ.40 లక్షల వరకు రుణాన్ని 10.9% వడ్డీ రేటుతో మంజూరు చేస్తుంది, గరిష్ఠ కాలపరిమితి 6 సంవత్సరాలు. యాక్సిస్ బ్యాంక్ రూ.10 లక్షల వరకు రుణాన్ని అందించగా, వడ్డీ రేటు 10.49% నుంచి ప్రారంభమవుతుంది, ఇది కూడా 6 సంవత్సరాల గరిష్ఠ పరిమితి కలిగి ఉంది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా 10.99% ప్రారంభ వడ్డీ రేటుతో రూ.35 లక్షల వరకు రుణం ఇస్తోంది. IDFC FIRST బ్యాంక్ రూ.10 లక్షల వరకు రుణాన్ని 10.7% ప్రారంభ వడ్డీ రేటుతో మంజూరు చేస్తోంది, అయితే గరిష్ఠ కాలపరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించింది. చివరగా, సౌత్ ఇండియా బ్యాంకు 10.05% వడ్డీ రేటుతో రూ.20 లక్షల వరకు రుణం మంజూరు చేస్తోంది, దీనికి గరిష్ఠ కాలపరిమితి 5 సంవత్సరాలు.
మొదటగా మీకు అప్పటికే అకౌంట్ ఉన్న బ్యాంక్‌లో అప్లై చేస్తే ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. సాధారణంగా వడ్డీ రేట్లు 10% నుండి ప్రారంభమవుతాయి, కొన్నిసార్లు 16% లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. వడ్డీ రేట్లు బ్యాంకు, మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఇతర అర్హతల ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ అవసరాలకు తగిన గరిష్ఠ లోన్ మొత్తం, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా 1% నుండి 3% వరకు ఇతర షరతులను కూడా పరిశీలించండి. ప్రతి బ్యాంక్‌కు ప్రత్యేకమైన అర్హతలు, డాక్యుమెంట్లు ఉండొచ్చు.
మొత్తంగా, ఎన్‌ఆర్‌ఐలు వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు భారతదేశంలో రుణం పొందడం ఇప్పుడు చాలా సులభంగా మారింది. సరైన బ్యాంక్ ఎంపిక, అవసరమైన డాక్యుమెంట్ల సమర్పణ, మరియు నమ్మదగిన కో-అప్లికెంట్‌తో కలిసి ఈ ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చు. బ్యాంకుల వడ్డీ రేట్లు, రీపేమెంట్ టెర్మ్స్, ఇతర షరతులు వేటిని అయినా అప్లై చేసేముందు బాగా పరిశీలించడం ముఖ్యం. సాంకేతిక సదుపాయాలతో విదేశాల్లో నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్ ఇచ్చే సౌకర్యం ఉండటం ఎన్‌ఆర్‌ఐలకు మరింత సులభతను కలిగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications