For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal finance: ఈ 3 చాలా ముఖ్యం, అలా అయితే రివర్స్ చేయండి

|

ఎప్పటికప్పుడు చిన్న మొత్తాన్ని సేవ్ చేయడం ద్వారా కొన్నాళ్లకు పెద్ద మొత్తాన్ని చూడవచ్చు. మీ ఆదాయంలో కొంత భాగాన్ని అధిక దిగుబడిని ఇచ్చే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ డబ్బును వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు డబ్బు ఖర్చు చేసే సమయంలోను డబ్బును ఆదా చేసే అంశాలు చాలా ముఖ్యం. ప్రతి రూపాయిని ఆదా చేయడం ద్వారా అలాగే సరైన విధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను నిర్మించుకోవచ్చు.

ఈ మూడు చాలా ముఖ్యం

ఈ మూడు చాలా ముఖ్యం

పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన వారైనా లేదా ఇప్పటికే పెట్టుబడులు పెట్టేవారైనా మూడు అంశాలు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఖర్చులు (స్పెండింగ్స్) బారోయింగ్(రుణాలు), పెట్టుబడులు (ఇన్వెస్టింగ్) కీలకం. నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం నిత్యం ఖర్చులు అవుతుంటాయి. ఏదో ఒక సమయంలో దాదాపు అందరూ రుణాలు తీసుకుంటారు. తద్వారా జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మీ లైఫ్ గోల్స్ కోసం, అలాగే డబ్బులు సేవ్ చేయడానికి, ఆచితూచి ఖర్చులు చేయడానికి చూడాలి.

అలా అయితే రివర్స్ చేయండి

అలా అయితే రివర్స్ చేయండి

- పెట్టుబడి పెట్టడం ప్రారంభం నుండే అలవర్చుకోవాలి. ప్రారంభంలో చేసే చిన్న మొత్తం కొద్దిగానే కనిపించవచ్చు. కానీ ఇది మీకు సేవ్ చేసే అలవాటు చేయడంతో పాటు కొద్ది రోజుల తర్వాత ఈ మొత్తం ఒక్కసారిగా ఎక్కువ అవుతుంది.

- మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని ఖర్చులకు ఉపయోగించాలి. ప్రతి నెల వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని సేవ్ చేయడానికి ఉపయోగించాలి. ఇప్పటి వరకు మీరు మొదట ఖర్చు చేసి ఆ తర్వాత మిగిలిన దానిని సేవ్ చేస్తుంటే కనుక దానిని రివర్స్ చేయండి. ఇక నుండి సేవ్ చేయడానికి కొంత పరిమితిని పక్కన పెట్టండి. ఆ తర్వాత మిగతా వాటిని ఖర్చు చేయండి. ఇలా ప్లాన్ చేసుకోవడం మంచిది.

అకౌంట్ చెక్ చేయండి

అకౌంట్ చెక్ చేయండి

- మీ బ్యాంకు అకౌంట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. చాలామందికి ఒకటి లేదా రెండుకు మించి బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ సహా వివిధ కారణాలతో మీ అకౌంట్ పైన ఛార్జీ పడితే వాటి గురించి తెలుసుకోండి.

- లైఫ్ ఇన్సురెన్స్ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ కూడా ముఖ్యమే. చిన్న మొత్తాలను బీమాలో పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్యపర సమస్యలు తలెత్తితే పెద్ద మొత్తంలో ఖర్చును భరించలేని వారికి ప్రయోజనకరం.

క్రెడిట్ కార్డ్ ఉపయోగం

క్రెడిట్ కార్డ్ ఉపయోగం

- క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం. గడువులోగా చెల్లింపులు చేయడం తప్పనిసరి. క్రెడిట్ కార్డ్ డ్యూస్ గడువులోగా చెల్లించకుంటే కొన్ని కార్డ్స్ పైన దాదాపు 40 శాతం వడ్డీ రేటు కూడా ఉంది.

- హోమ్ లోన్ ఉంటే ముందస్తుగా చెల్లించే అవకాశం ఉంటే పే చేయడం మంచిది. లోన్ పూర్తి చేసుకుంటే ఆ తర్వాత సేవింగ్స్ చేసుకోవచ్చు.

- డిజిటల్ ద్వారా షాపింగ్స్ చేయండి. కొన్ని ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్‌లో తక్కువగా ఉంటాయి.

English summary

Personal finance: ఈ 3 చాలా ముఖ్యం, అలా అయితే రివర్స్ చేయండి | Personal finance tips for beginners: How to save and spend smartly

As a beginner there are three areas that you need to have a firm grip upon spending, borrowing and investing.
Story first published: Sunday, July 11, 2021, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X