For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష్యం, బడ్జెట్ రుణ చెల్లింపు, పెట్టుబడులు..: 2022లో పర్సనల్ ఫైనాన్స్ రిజల్యూషన్స్

|

కొత్త ఏడాదిలో చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటారు. ఆర్థికపరంగా కూడా కొన్ని తీర్మానాలు అవశ్యం. మీ ఆర్థిక వ్యవహారాలు నియంత్రణలో, ప్రణాళికాబద్దంగా ఉంటే మీరు ఏడాది పొడవును.. ఇంకా చెప్పాలంటే జీవితాంతం ప్రశాంతంగా ఉండవచ్చు. ఇష్టారీతిన ఖర్చులు చేయకుండా ఉండటం మొదలు క్రెడిట్ కార్డును తెలివిగా వినియోగించడం, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ కొత్త ఏడాదిలో మీరు కొన్ని ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకోవచ్చు. కరోనా నేపథ్యంలో చాలామంది ఫైనాన్షియల్ హెల్త్, అలాగే ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్‌లు పెరిగాయి. ఇక్కడ టాప్ 5 ఫైనాన్షియల్ రిజొల్యూషన్స్ చూడండి..

సహేతుకమైన రాబడి అంచనాలతో లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి

సహేతుకమైన రాబడి అంచనాలతో లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి

కొన్ని సమయాల్లో మన అంచనాలు తప్పవచ్చు. గత ఏడాది మార్కెట్ రిటర్న్స్ అదరగొట్టాయి. కాబట్టి ఈ ఏడాది స్టాక్ మార్కెట్ వైపు దృష్టి సారించే ఇన్వెస్టర్లు మరింతగా పెరుగుతారు. అయితే గత ఏడాది అద్భుత రిటర్న్స్ ఇచ్చినంత మాత్రాన ఈ ఏడాది కూడా అలాగే ఉండాలని లేదు. మార్కెట్ పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మొదట మీ స్వల్పకాలిక, దీర్గకాలిక లక్ష్యాలను జాబితా చేయాలి. ఉదాహరణకు స్వల్పకాలిక లక్ష్యాల కోసం మీరు స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మితమైన రాబడిని అందిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి సారించాలి. ద్రవ్యోల్భణాన్ని అధిగమించే రాబడిని పొందవచ్చు.

బడ్జెట్ అప్ డేట్

బడ్జెట్ అప్ డేట్

ఫ్యామిలీ బడ్జెట్ హ్యాండ్లింగ్ ఎప్పుడూ అవసరం. బడ్జెట్ మెరుగైన మార్గంలో వెళ్లేందుకు ఉపకరిస్తుంది. కుటుంబంతో కలిసి బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం మంచిది. బడ్జెట్‌ను రూపొందించడం, దానిని ట్రాక్ చేయడం, బడ్జెట్‌కు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. మీరు బడ్జెట్‌కు కట్టుబడి ఉండే కొంత ఆదాయాన్ని ఆదా చేసుకోగలుగుతారు.

రుణ చెల్లింపులు

రుణ చెల్లింపులు

క్రెడిట్ కార్డు తీసుకోవడం ఇప్పుడు సాధారణం. ఇక బ్యాంకు అకౌంట్ తీసుకుంటే డెబిట్ కార్డు ఇస్తారు. ఇటీవల రుణగ్రహీతలు తీసుకునే రుణాల మొత్తం పెరుగుతోంది. క్రెడిట్ కార్డు రుణాలు లేదా ఇతర రుణాలు ఉంటే కనుక వాటిని చెల్లించే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ కార్డు రుణాన్ని ఎప్పటికప్పుడు చెల్లించడం తెలివైన పని.

టర్మ్, హెల్త్ ఇన్సురెన్స్

టర్మ్, హెల్త్ ఇన్సురెన్స్

కరోనా ముందు వరకు చాలామంది బీమా ఎందుకు అని అభిప్రాయపడ్డారు. అయితే కరోనా తర్వాత లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రాధాన్యత అర్థమైంది. అందుకే ఇటీవల ఇన్సురెన్స్ తీసుకోవడం పెరిగింది. కుటుంబానికి తగినంత ఇన్సురెన్స్ తీసుకోవడం మంచిది. టర్మ్ కవర్ మీ వార్షిక ఆదాయానికి పది రెట్లు కూడా ఉండవచ్చు. ఈ ఇన్సురెన్స్ ద్వారా మీ వార్షిక ఆదాయంలోని పది శాతం అంతకంటే ఎక్కువ ప్రభావం చూపవచ్చు.

మార్కెట్ అస్థిరతను పక్కన పెట్టి పెట్టుబటి పెట్టాలి

మార్కెట్ అస్థిరతను పక్కన పెట్టి పెట్టుబటి పెట్టాలి

మార్కెట్ అస్థిర పరిస్థితులను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాలి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుటు దీర్ఘకాలంలో లాభదాయకమే. స్వల్పకాలంలో మంచి రిటర్న్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలం మాత్రం ప్రయోజనకరం. అయితే అనుకోని పరిణామాలు ఏవైనా చోటు చేసుకుంటే అది వేరే విషయం. అందుకే మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నదని చెబుతారు. ఆయా స్టాక్స్ లేదా రంగాల్లో ఇన్వెస్ట్ చేసే సమయంలో హిస్టరీని చూడాలి. ప్రొఫెషనల్ ఫైనాన్సర్ల నుండి ఆర్థిక సలహాలు తీసుకోవచ్చు.

English summary

లక్ష్యం, బడ్జెట్ రుణ చెల్లింపు, పెట్టుబడులు..: 2022లో పర్సనల్ ఫైనాన్స్ రిజల్యూషన్స్ | Personal Finance Resolutions For year 2022

A new year means new financial goals. You will feel more at peace all through the year if your finances are under control and planned.
Story first published: Tuesday, January 4, 2022, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X